Anguilla News: ఇప్పుడు AI ట్రెండ్ నడుస్తోంది. ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. మన ఫొటోలను ఎడిట్ చేసుకోవడం నుంచి కంపెనీలు గూడ్స్ అండ్ సర్వీస్‌ల కోసం AI రోబోలను వాడేంత వరకూ పెరిగిపోయింది ఈ టెక్నాలజీ వినియోగం. భవిష్యత్‌లో మనుషులతో కన్నా AIతోనే ఎక్కువ పని ఉంటుందని ఇప్పటికే చాలా మంది ఎక్స్‌పర్ట్స్‌ బల్లగుద్ది చెబుతున్నారు. ఈ డిమాండ్‌నే వాడుకుని ఓ చిన్న ద్వీపం లక్షల ఆదాయం గడిస్తోంది. కరేబియన్ ద్వీపం అంగ్విల్లా (Anguilla Isalnd) కి వచ్చే ఆదాయంలో మూడొంతులు AI టెక్నాలజీ తెచ్చి పెడుతోంది. Forbes ఈ విషయం వెల్లడించింది. ఎలాంటి  శ్రమ లేకుండా, బుర్రంతా పగలగొట్టుకుని కోడ్‌లు రాసే అవసరం లేకుండానే ఇలా కట్టలు కట్టల రెవెన్యూ వచ్చి పడుతోంది. ఇంతకీ ఈ ద్వీపం ఏం చేస్తోంది..? అంత ఆదాయం ఎలా వస్తోంది..?


ఇదీ అసలు సంగతి..


Eastern Caribbean Currency Union లో అంగ్విల్లా ద్వీపానికి సభ్యత్వం ఉంది. ఇంటర్నెట్ అడ్రెస్‌లు రిజిస్టర్ చేసుకునే వాళ్ల నుంచి ఈ లక్షలు సంపాదిస్తోంది. అదెలా అంటే... ఇంటర్నెట్ అడ్రెస్‌లో .ai ఉంటే చాలు. వెంటనే వాళ్ల నుంచి భారీ మొత్తంలో ఫీ వసూలు చేస్తోంది అంగ్విల్లా ఐల్యాండ్. ఈ ద్వీపానికి .aiతో డొమైన్‌ని కేటాయించారు. అయితే...ఈ ఎక్స్‌టెన్షన్‌పై ప్రపంచ దేశాలు మసను పారేసుకుంటున్నాయి. ఈ విషయం స్వయంగా IMF వెల్లడించింది. రెండేళ్ల క్రితం AI టూల్‌ ChatGPT అందుబాటులోకి వచ్చింది. ఆ సమయంలోనే ఈ టెక్నాలజీపై విపరీతమైన చర్చ జరిగింది. మనం పెద్దగా ఆలోచించకుండానే జస్ట్‌ ఓ క్వశ్చన్ అడిగితే దానికి సంబంధించిన కంటెంట్‌ మొత్తం కళ్ల ముందుకు వచ్చేస్తోంది. అందుకే చాట్‌జీపీటీ చాలా తొందరగా మార్కెట్‌లో ఫేమస్ అయిపోయింది. అయితే...2022 తరవాత .ai డొమైన్‌తో ఇంటర్నెట్ అడ్రెస్‌ల రిజిస్ట్రేషన్‌లకు డిమాండ్ పెరిగింది. 


డొమైన్‌ పేరుతో దశ తిరిగింది..


IMF చెప్పిన లెక్కల ప్రకారం 2022లో వీటి రిజిస్ట్రేషన్స్‌ లక్షా 44 వేలు ఉంటే...అది 2023 నాటికి మూడున్నర లక్షలకుపైగా పెరిగింది. గతేడాది .ai డొమైన్ రిజిస్ట్రేషన్‌లతో అంగ్విల్లా ఐల్యాండ్‌ దాదాపు 87 మిలియన్ కరేబియన్ డాలర్లు సంపాదించుకుంది. ఆ సంవత్సరంలో ప్రభుత్వానికి వచ్చిన రెవెన్యూలో దీనికే 20% వాటా ఉంది. ఈ డొమైన్‌ రిజిస్ట్రేషన్స్‌లో గతంలో పోల్చితే 5% పెరుగుదల కనిపిస్తోందని అక్కడి అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఈ ప్రక్రియ కాస్త మందకొడిగానే ఉందని, ఇంకాస్త ఊపందుకుంటే ఆదాయం గట్టిగానే వస్తుందని స్పష్టం చేస్తున్నారు. .ai డొమైన్ కేటాయించడానికి కారణం...ఈ ద్వీపం పేరే. Anguilla రెండు అక్షరాలు తీసుకుని డొమైన్‌ కేటాయిస్తారు. ఉదాహరణకు ఇండియా విషయానికొస్తే .in ఉంటుంది. అదే ఫ్రాన్స్‌లో అయితే .fr అని ఉంటుంది. సో...ఇలా ఈ ద్వీపం పేరే లక్షలు కుమ్మరిస్తోంది. .aiతో ఆ దేశం డొమైన్ రిజిస్ట్రేషన్‌ ఉండడం వల్ల అదే డొమైన్‌తో రిజిస్టర్ చేసుకోవాలని ఎవరు అనుకున్నా..ఆ మేరకు ఫీ చెల్లించాల్సి ఉంటుంది. అలా ఈ దేశం ఖజానా నింపుకుంటోంది. 


Also Read: Porsche Car Crash: బర్త్‌డే గిఫ్ట్‌గా పోర్షే కార్ ఇచ్చిన తాత, అదే కార్‌తో మైనర్ యాక్సిడెంట్ - దర్యాప్తులో కీలక విషయాలు