Vijay Mallya and Lalit Modi: భారతదేశం నుంచి పరారైన లలిత్ మోదీ, విజయ్ మాల్యా లండన్ లో పార్టీలు చేసుకుంటూ జల్సాగా గడిపేస్తున్నారు. లలిత్ మోదీ తన లండన్ నివాసంలో భారీ పార్టీ ఇచ్చాడు. 310 మందికి పైగా అతిథులు హాజరయ్యారు, వీరిలో లలిత్ మోదీ స్నేహితులు , కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇతర దేశాల నుంచి కూడా ఈ పార్టీకి హాజరయ్యారు. మాజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్రికెటర్ క్రిస్ గేల్ కూడా పార్టీ కోసం లండన్ వచ్చాడు. ఈ ఈవెంట్‌ను "అద్భుతమైన సాయంత్రం"గా వర్ణిస్తూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో లలిత్ మోదీ, విజయ్ మాల్యాతో ఒక ఫోటోను షేర్ చేశాడు.
ఈ పార్టీలో లలిత్ మోదీ , విజయ్ మాల్యా ఫ్రాంక్ సినాట్రా క్లాసిక్ పాట "I Did It My Way"ని కరోకేలో ఆలపించారు. ల లలిత్ మోదీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. కరోకే సెటప్‌ను ఏర్పాటు చేసిన సంగీతకారుడు కార్ల్టన్ బ్రగంజాకు లలిత్ మోదీ ధన్యవాదాలు తెలిపాడు, క్రిస్ గేల్‌ను "యూనివర్స్ బాస్"గా సూచిస్తూ అతనికి ఒక బ్యాట్‌ను బహుమతిగా ఇచ్చినట్లు చెప్పాడు. ఇది 2013లో RCB కోసం 66 బంతుల్లో 175 పరుగులు సాధించిన బ్యాట్.
ఈ వీడియో సోషల్ మీడియాలో, ముఖ్యంగా X ప్లాట్‌ఫామ్‌లో వైరల్‌గా మారింది. లలిత్ మోదీ, విజయ్ మాల్యా భారతదేశంలో ఆర్థిక నేరాల ఆరోపణలను ఎదుర్కొంటూ లండన్‌లో విలాసవంతమైన జీవనశైలిని ఆస్వాదిస్తున్నారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లలిత్ మోదీపై ఐపీఎల్‌లో ఆర్థిక అక్రమాలు, మనీ లాండరింగ్, ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (FEMA) ఉల్లంఘనల ఆరోపణలు ఉన్నాయి. అతను 2010 నుండి పరారీలో ఉన్నాడు.
విజయ్ మాల్యా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించి రూ. 9,000 కోట్ల రుణాల డిఫాల్ట్ మరియు మనీ లాండరింగ్ ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు. భారత ప్రజల నుండి డబ్బు దోచుకుని విలాసవంతమైన జీవనం గడపడం దురదృష్టకరని వారిని తీసుకొచ్చి శిక్షించాలని కోరుతున్నారు.