జనవరి మొదటి వారంలో కాంగ్రెస్‌లోకి షర్మిల- ఏపీ ఎన్నికల బాధ్యతలు అప్పగించే అవకాశం!
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మరో మలుపు తిరగబోతున్నాయి. వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ(YSR Telangana Party)తో తెలంగాణ(Telangana) రాజకీయాల్లో సంచలనంగా మారిన వైఎస్‌ షర్మిల(YS Sharmila) మరో కీలకమైన స్టెప్ వేయబోతున్నారు. జనవరి మొదటి వారంలో ఆమె కాంగ్రెస్‌(Congress)లో చేరబోతున్నట్టు తెలుస్తోంది. పూర్తిస్థాయిలో చర్చలు జరిగిపోయినట్టు రెండు పార్టీల నేతలు చెప్పుకుంటున్నారు. జనవరి మొదటి వారంలో మంచి ముహూర్తం చూసుకొని ఢిల్లీ(Delhi) వేదికగా షర్మిల కాంగ్రెస్‌లో చేరబోతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోడీతో రేవంత్ రెడ్డి సమావేశం
తెలంగాణ (Telangana)ముఖ్యమంత్రి ( Chief Minister) రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఢిల్లీ (Delhi ) చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi)తో సాయంత్రం నాలుగు గంటలకు భేటీ అవనున్నారు. రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత తర్వాత తొలిసారి ప్రధాని మోడీని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు కలవనుండటంతో ప్రాధాన్యత ఏర్పడింది. పెండింగ్ లో ప్రాజెక్టులు, రాష్ట్ర విభజన సమస్యలు, నిధులు, అభివృద్ధి ప్రాజెక్టుల గురించే చర్చించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ఏపీలో వాలంటీర్లు, పారిశుద్ధ్య కార్మికుల సమ్మె- జీతాలు పెంచాలని డిమాండ్‌
ఆంధ్రప్రదేశ్‌ లో ఎన్నికల ముందు జగన్‌ సర్కార్‌పై సమ్మెల సెగ తగులుతోంది. జగన్‌ సొంత సైన్యంగా భావించే వాలంటీర్లు (volunteers) కూడా ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. వేతనం  పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. సమ్మెలో భాగంగా... 'ఆడుదాం ఆంధ్రా' కార్యక్రమాన్ని కూడా బహిష్కరించాలని నిర్ణయించారు వాలంటీర్లు. వాలంటర్లు సమ్మెకు దిగకుండా ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ ఫలితం కలపించలేదు. తీవ్ర అసంతృప్తితో ఉన్న వాలంటీర్లు సమ్మెకే సై అన్నారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ఆడుదాం ఆంధ్రా పోటీలు ప్రారంభించిన జగన్- 47 రోజులు వివిధ దశల్లో సాగనున్న బిగ్ ఈవెంట్
ఆడుదాం ఆంధ్రా(Adudam Andhra) పోటీలను సీఎం జగన్‌(Jagan) గుంటూరు జిల్లా(Guntur) నల్లపాడులోని(Nallapadu) లయోలా కాలేజీ(Loyola College)లో ప్రారంభించారు. క్రీడా జ్యోతిని వెలిగించి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. అనంతరం మాట్లాడిన జగన్... ఈ స్పోర్ట్స్ ఈవెంట్ దేశ చరిత్లోనే మైలురాయిగా చెప్పుకోవచ్చన్నారు. 47 రోజుల పాటు అందరూ పాల్గొనే గొప్ప క్రీడల పండుగ అని అన్నారు. ఆరోగ్యానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని బీపీ, షుగర్ అదుపులో ఉంటాయని తెలిపారు. అనంతరం ఆడుదాం ఆంధ్రలో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ కిట్స్‌ను పరిశీలించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


లోక్‌సభ ఎన్నికలకు 90 రోజల ప్లాన్ - తెలంగాణ బీజేపీకి అమిత్ షా రోడ్ మ్యాప్ !
తెలంగాణలో బీజేపీకి డబల్ డిజిట్ ఎంపీ సీట్లు వస్తాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నమ్మకం వ్యక్తం చేశారు.  పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈనెల 28న బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం ఉంటుందని తెలిపారు. నాంపల్లిలో బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో మేము ఆశించిన పలితాలు రాకపోయినా ఓట్ల శాతం పెరిగిందన్నారు. సీట్లు పెరిగాయన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి