AP CM Jagan Started Adudam Andhra Sports Event: ఆడుదాం ఆంధ్రా(Adudam Andhra) పోటీలను సీఎం(APCM) జగన్‌(Jagan) గుంటూరు జిల్లా(Guntur) నల్లపాడులోని(Nallapadu) లయోలా కాలేజీ(Loyola College)లో ప్రారంభించారు. క్రీడా జ్యోతిని వెలిగించి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. అనంతరం మాట్లాడిన జగన్... ఈ స్పోర్ట్స్ ఈవెంట్ దేశ చరిత్లోనే మైలురాయిగా చెప్పుకోవచ్చన్నారు. 47 రోజుల పాటు అందరూ పాల్గొనే గొప్ప క్రీడల పండుగ అని అన్నారు. ఆరోగ్యానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని బీపీ, షుగర్ అదుపులో ఉంటాయని తెలిపారు. అనంతరం ఆడుదాం ఆంధ్రలో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ కిట్స్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, రోజా, అంబటిరాంబాబు, మేరుగ నాగార్జున, విడదల రజినీతోపాటు జిల్లా అధికారులు ఇతర వైసీపీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 


మెగా ఈవెంట్‌గా రూపకల్పన


దేశంలో అతి పెద్ద మెగా ట్రోర్నీగా ఆడుదాం ఆంధ్రాను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ క్రీడలు 15 వేలకుపైగా గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో ప్రారంభమయ్యాయి. 9,478 స్టేడియంలలో దాదాపు మూడు లక్షలపైగా జట్లు పోటీ పడనున్నాయి. ఇవాళ(డిసెంబర్‌ 26, మంగళవారం) ప్రారంభమైన ఈ పుోటీలు 47 రోజుల పాటు అంటే ఫ్రిబ్రవరి 10 వరకు జరగనున్నాయి. 


వివిధ దశల్లో పోటీలు 


ఈ పోటీలను వివిధ దశల్లో నిర్వహిస్తారు. తొలి దశలో జనవరి 9 వరకు గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో పోటీలు జరుగుతాయి. అక్కడ విజయం సాధించిన వాళ్లు తర్వాత దశ పోటీలకు ఎంపిక అవుతారు. వాళ్లు జనవరి పది నుంచి జరిగే మండలస్థాయిలో పోటీ పడతారు. ఆ పోటీలు జనవరి 23 వరకు జరుగుతాయి. అక్కడ విజేతలైన వారంతా నియోజకవర్గ స్థాయి క్రీడల్లో పాల్గొంటారు. ఈ పోటీలు జనవరి 24 నుంచి 30 వరకు సాగనున్నాయి. తర్వాత దశలో జిల్లా స్థాయిలో క్రీడాకారులు పోటీ పడాల్సి ఉంటుంది. ఈ జిల్లా స్థాయి పోటీలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 5 వరకు ఉంటాయి. చివరిగా ఫైనల్‌ పోటీలు రాష్ట్రస్థాయిలో జరుగుతాయి. వివిధ జిల్లాల్లో విజయం సాధించిన వారంతా ఇక్కడ పోటీ పడతారు. ఈ రాష్ట్ర స్థాయి పోటీలు ఫిబ్రవరి ఆరు నుంచి 10 వరకు జరగనున్నాయి. 


34 లక్షల మంది పోటీ 


రోజూ ఉదయం ఐదు గంటలకు పోటీలు ప్రారంభమవుతాయి. సాయంత్రం 7 గంటల వరకు జరగనున్నాయి. ఈ పోటీలకు రిఫరీలుగా ఉండేందుకు  లక్షా యాభై వేల మంది వలంటీరల్కు శఇక్షణ ఇచ్చారు. 15 ఏళ్ల వయసు దాటిన వారంతా ఈ ఈవెంట్‌లో పాల్గొనే ఛాన్స్ ఇచ్చారు. అందుకే కోటీ 22 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో 34 లక్షల మంది క్రీడాకారులు పోటీ పడుతున్నారు. ఇందులో పది లక్షల మంది మహిళా క్రీడాకారులు ఉన్నారు. ఐదు క్రీడాంశాల్లో పోటీలు జరగనున్నాయి. ఇందులో క్రికెట్‌కు ఎక్కువ మంది రిజిస్టర్ చేసుకున్నారు. 


భారీగా కిట్‌ల పంపిణీ 


ఈ ఈ వెంట్ కోసం ప్రభుత్వం 120 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. ఇందులో 12 కోట్ల రూపాయల నగదు బహుమతులు ప్రదానం చేయనున్నారు. 42 కోట్లతో క్రికెట్‌, వాలీబాల్‌, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్‌ క్రీడాకారులకు కిట్‌లు పంపిణీ చేయనున్నారు. పాల్గొనే వారందరికీ టీ షర్టులు అందజేయనున్నారు.