AP Govt Hikes pay for Sanitation Workers: అమరావతి: ఏపీ మున్సిపల్ కార్మిక సంఘాల ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు కొంతమేర సఫలం అయ్యాయి. శానిటేషన్ సిబ్బందికి (పారిశుద్ధ్య కార్మికులకు) రూ.21 వేల వేతనం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. హెల్త్ అలవెన్స్ రూ.6 వేలు ఇవ్వాలన్న డిమాండ్ కు మంత్రుల సబ్ కమిటీ ఓకే చెప్పింది. ఏపీ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, కొందరు ఉన్నతాధికారులు సచివాలయంలో కార్మిక సంఘాల ప్రతినిధులతో రెండు గంటలకు పైగా సుదీర్ఘంగా చర్చించారు. మున్సిపల్‌ కార్మికులు తక్షణమే సమ్మె విరమించి విధుల్లో చేరితే నిర్ణయాలను అమలు చేస్తామని మంత్రి బొత్స అన్నారు. కార్మికులు సమ్మె విరమించిన తరువాతే నోటిఫికేషన్‌ ఇస్తాం. పెంచిన వేతనం అలవెన్స్ వచ్చే ప్రభుత్వంలోనే ఇస్తామని తేల్చి చెప్పామన్నారు.




మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ..  శానిటేటెడ్ రిలేటెడ్ వర్కర్లు ఒకే క్యాటగిరికి తెచ్చి  21 వేలు జీతం ఇచ్చేందుకు జిఎంఓ అంగీకరించారు. ఆరు వేలు హెల్త్ అలవెన్స్ జీతంగా మార్పు. 15 వేలు జీతంతో కలిపి 21 వేలుకు నిర్ణయం తీసుకున్నారు. శానిటేషన్ డ్రైవర్లు,  క్లీనర్లు,  మలేరియా ఫాగింగ్ చేసే వర్కర్లు, పార్కుల్లో శానిటేషన్ సిబ్బందిని కూడా ఈ కోవలో చేర్చాలన్న డిమాండ్ కు మంత్రుల సబ్ కమిటీ అంగీకారం తెలిపింది. కుక్కలు, పాములు , కోతులు పట్టే వారు, అనాధ శవాలు ఖననం చేసే వారిని కూడా 21 వేల శాలరీకి అంగీకరించారు. ఇంజనీరింగ్ విభాగం 8 క్యాటగిరిల వారిని అన్ స్కిల్డ్ నుండ్ నుంచి సెమీ స్కిండ్ కు జిఎంఓ అంగీకారం తెలిపింది. విలీన గ్రామాల పంచాయితీ కార్మికులను మున్సిపల్ కార్మికులుగా గుర్తించి 36 వేల మందికి 21 వేలు జీతం ఇస్తామని చెప్పారు. రిటైడ్మెంట్ బెన్ఫిట్ డిమాండ్ లపై ఇంకా క్లారిటీ రాలేదన్నారు. ప్రమాదవశాత్తు చనిపోయిన కార్మికులకు నష్టపరిహారం 2019 నుండి ఇవ్వాని డిమాండ్ చేసినట్లు తెలిపారు. నష్టపరిహారం పెంపు, చనిపోయినవారికి మట్టి పెంపుపై డిమాండ్ చేశామన్నారు.


పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్లు ఏంటంటే.. 
పారిశుధ్య కార్మికుల డిమాండ్లలో ప్రధానమైనటువంటి కేటగిరీల వారీగా బేసిక్ పే చెల్లింపులు, పొరుగు సేవల విధానాన్ని కాంట్రాక్టు, శాశ్వత ఉద్యోగులుగా పర్మినెంట్ చేయాలి సహా మరికొన్ని అంశాలపై చర్చ జరిగింది. వీటితో పాటు అవుట్ సోర్సింగ్ పై పనిచేసే పారిశుధ్య, ఇంజనీరింగ్, ఇతర సిబ్బందికి అన్ని ప్రభుత్వ పథకాలు వర్తింపచేయడం, నియామకాల్లో వెయిటేజీ మార్కులు కేటాయించడం, ఖాళీగా ఉన్న రెగ్యులర్ పోస్టులను వెంటనే భర్తీ చేయడం, అవసరానికి తగ్గట్టుగా పారిశుధ్య కార్మికుల సంఖ్యను పెంచడం, కాంట్రాక్టు విధానంలో ఘన వ్యర్థాలను తరలించే వాహనాల పనితీరును మెరగుపర్చడం, పారిశుధ్య కార్మికులు, ఇంజనీరింగ్ సిబ్బంది, పార్కుల నిర్వహణ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వర్కర్ల నిర్వహించే పనుల ఆధారంగా వారికి బేసిక్ పే నిర్ణయించడం తదితర అంశాలపై ఈ సమావేశంలో కార్మిక సంఘాల ప్రతినిధులతో మంత్రులు, ఉన్నతాధికారులు చర్చించారు. రెగ్యులర్ ఉద్యోగులకు పెయిడ్ లీవ్, జీపీఎఫ్‌ ఖాతాలు తెరవడంతోపాటు హెల్త్‌ కార్డులు మంజూరు చేయాలని సైతం డిమాండ్ చేస్తున్నారు.