Jagadhatri Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో కేదార్ పరిస్థితిని తలుచుకొని బాధపడుతుంది ధాత్రి. కేదార్ ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణం యువరాజ్ అని రుజువైతే మాత్రం అతడిని వదిలిపెట్టేది లేదు అని కసిగా అనుకుంటుంది.
మరోవైపు ఆఫీసులో ఉన్న సుధాకర్ బ్లడ్ కావాలంటూ పెట్టిన మెసేజ్ చూసి డాక్టర్ కి ఫోన్ చేస్తాడు.
సుధాకర్: డాక్టర్ నేను బ్లడ్ డోనర్స్ మెంబర్ ని మీరు బ్లడ్ కావాలని మెసేజ్ పెట్టారు కదా ఎవరైనా వచ్చారా అని అడుగుతాడు.
డాక్టర్: లేదండి పేషెంట్ పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది మీకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రండి అని చెప్పటంతో హాస్పిటల్ కి బయలుదేరుతాడు సుధాకర్.
డాక్టర్ : ధాత్రి దగ్గరికి వచ్చి అదృష్టం కొద్ది డోనర్ దొరికారు కాసేపట్లో వచ్చేస్తారు అని చెప్తాడు. అప్పుడే కేదార్ పరిస్థితి క్రిటికల్ గా ఉండటంతో చెక్ అప్ చేసి బయటకు వచ్చిన డాక్టర్ అతని పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది డోనర్ వచ్చి బ్లడ్ ఇచ్చే వరకు సిచువేషన్ స్టేబుల్ గా ఉంటే పర్వాలేదు లేదంటే మా చేతుల్లో ఏమీ లేదు అని చెప్పి వెళ్ళిపోతాడు.
ఆ మాటలకి ధాత్రి కన్నీరు పెట్టుకుంటుంది.
యువరాజ్: ఇదంతా పక్క నుంచి చూస్తున్న యువరాజ్ ఓకే దెబ్బకి కేదార్ పైకి, ధాత్రి ఇంట్లోంచి బయటికి వెళ్లిపోతారు అని కసిగా నవ్వుకుంటాడు. అంతలోనే వెనక్కి తిరిగేసరికి కంగారుగా వస్తున్న తండ్రిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇంట్లో ఏ సంబంధం లేదని చెప్పి ఇక్కడ ప్రమాదం జరిగిన వెంటనే కాపాడటానికి వచ్చేసాడు అంటే వీళ్ళిద్దరికీ కచ్చితంగా సంబంధం ఉంది అని కోపంతో రగిలిపోతాడు.
మరోవైపు సుధాకర్ బ్లడ్ ఇచ్చి బయటికి వచ్చి ఆ అబ్బాయికి ఎలా ఉంది అని అడుగుతాడు.
డాక్టర్: ప్రస్తుతం పరవాలేదు మీరు ఆ కుటుంబాన్ని నిలబెట్టినట్లే అంటాడు.
సుధాకర్: ఆ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు చూడొచ్చా అంటాడు.
డాక్టర్ : చూడొచ్చు ఇక్కడే ఉన్నాడు అని చెప్పటంతో వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ కేదార్ ఉంటాడు. కేదార్ ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు సుధాకర్.
సుధాకర్: ఇతడిని ఎవరు తీసుకొచ్చారు అని అడుగుతాడు.
డాక్టర్ దూరంగా దేవుడిని ప్రార్థిస్తున్న ధాత్రిని చూపిస్తాడు.
సుధాకర్: మరింత కంగారు పడుతూ నేను బ్లడ్ ఇచ్చాను అని తెలిస్తే మరింత ప్రాబ్లం అవుతుంది అని చెప్పి కామ్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
డాక్టర్ : ధాత్రితో మాట్లాడుతూ మీ తాళి చాలా గట్టిది ప్రాణం నిలబడింది అని చెప్తాడు.
దేవుడికి థాంక్స్ చెప్పుకుంటుంది ధాత్రి. ఆ తర్వాత కేదార్ దగ్గరికి వెళ్లి నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోనందుకు థాంక్స్ అని ఎమోషనల్ అవుతుంది. అక్కడే ఉన్న సిస్టర్ చాలా కాంప్లికేటెడ్ కేస్ అయినప్పటికీ బ్రతికాడు నిజంగా మీ తాళి చాలా గట్టిది అంటుంది.
మరోవైపు సుధాకర్ ఇంటికి వచ్చి కేదార్ గురించి చాలా సీరియస్ గా ఆలోచిస్తూ ఉంటాడు. బ్లడ్ డొనేట్ చేశానని ఇంట్లో తెలిస్తే ఎంత గొడవ అవుతుందో అనుకుంటాడు. అప్పుడే యువరాజ్ తల్లిని తీసుకొని అక్కడికి వస్తాడు. యువరాజ్ కి బ్లడ్ ఇచ్చి వచ్చాడు అని తండ్రి ఎదురుగానే తల్లికి చెప్తాడు.
వైజయంతి: కోపంతో రగిలిపోతూ సుధాకర్ చేయి తీసి యువరాజ్ తల మీద పెట్టి ఇప్పుడు నిజం చెప్పు అసలు వాడికి నీకు ఉన్న సంబంధం ఏమిటి అతడిని తీసుకొచ్చి ఎందుకు ఇంట్లో పెట్టారు అని అడుగుతుంది.
సుధాకర్ ఏమీ మాట్లాడకపోవడంతో పాయిజన్ తాగేస్తుంది. ఒకసారిగా కంగారు పడి ఇంట్లో వాళ్ళందరినీ పిలుస్తాడు యువరాజ్. అందరూ వైజయంతి చుట్టూ చేరుతారు ఏం జరిగింది అని అడుగుతుంది కౌషికి.
యువరాజ్ :ఈ మనిషి తప్పు చేస్తున్నాడు అని సుధాకర్ ని చూపించి చెప్తాడు.
అదంతా తర్వాత హాస్పిటల్ కి తీసుకు వెళ్ళేటప్పటికి సీరియస్ అయిపోతుంది.. ఇక అతర్వాత కొంచెం కోలుకున్న వైజయంతి ఇప్పటికైనా నిజం చెప్పండి వాడిని తీసుకొచ్చి ఇంట్లో ఎందుకు పెట్టారు అని అడుగుతుంది. అక్కడితో ఈరోజు కథ ముగుస్తుంది.