Andheri East by-poll: మహారాష్ట్ర అంధేరి ఈస్ట్ ఉప ఎన్నిక బరి నుంచి తప్పుకోవాలని భారతీయ జనతా పార్టీ (భాజపా) నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే భాజపా అభ్యర్థి మూర్జి పటేల్ తన నామినేషన్ దాఖలు చేశారు. అయితే తాజాగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు మహారాష్ట్ర భాజపా అధ్యక్షుడు చంద్రశేఖర్ భవాన్‌కులే తెలిపారు. పార్టీ నిర్ణయంతో మూర్జి పటేల్ తన నామినేషన్‌ను ఉపసంహరించుకుంటారని ఆయన అన్నారు.
ఠాక్రే వర్గం
అంధేరి ఈస్ట్ నియోజకవర్గంలో దివంగత ఎమ్మెల్యే రమేష్ లట్కే స్థానంలో ఆయన భార్య రుతుజ లట్కే పోటీ చేస్తున్నారు. దీంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవం చేయాలని, పోటీకి అభ్యర్థిని పెట్టొద్దని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌కు ఎంఎన్‌ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే లేఖ రాశారు. ఈ ఉప ఎన్నికలో రుతుజ లట్కే ఎన్నిక ఏకగ్రీవం కావాలని ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ కోరారు.
కానీ అంధేరీ ఉప ఎన్నికలో శివసేన రెండు వర్గాలు నేరుగా తలపడేందుకు సిద్ధమయ్యాయి. భాజపా అభ్యర్థి ముర్జీ పటేల్‌కు శివసేన శిందే వర్గం మద్దతు పలికింది. అయితే భాజపా అనూహ్యంగా తన అభ్యర్థిని ఉపసంహరించుకుంది. దీంతో శివసేన ఉద్ధవ్ వర్గం అభ్యర్థిని రుతుజ లట్కే విజయానికి మార్గం సుగమమైంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈ సోమవారంతోనే ముగియనుంది. నవంబర్ 3న అంధేరి ఈస్ట్ ఉప ఎన్నిక జరగనుంది.
Also Read: Anti Hijab Row: ఇరాన్ మహిళలకు మద్దతుగా జుట్టు కత్తిరించుకున్న బాలీవుడ్ బ్యూటీ!