Anant Ambani Wedding Dress Code: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహం (Anant Ambani Wedding) జులై 12న జరగనుంది. దాదాపు మూడు రోజుల పాటు ఘనంగా ఈ వేడుకలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఇటలీ నుంచి ఫ్రాన్స్‌కి వెళ్తున్న క్రూజ్‌లో ఈ వేడుకలు గ్రాండ్‌గా మొదలయ్యాయి. బాలీవుడ్ ప్రముఖులు ఒక్కొక్కరుగా అక్కడి క్యూ కడుతున్నారు. వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్‌నీ విడుదల చేసింది అంబానీ ఫ్యామిలీ. ఇందులో ఆసక్తి కలిగించిన విషయం ఏంటంటే...మూడు రోజుల వేడుకలకు డ్రెస్ కోడ్ విధించారు. క్రూజ్ పార్టీకీ ఇదే విధంగా డ్రెస్ కోడ్ పెట్టిన అంబానీ ఫ్యామిలీ పెళ్లికి కూడా అదే రూల్ ఫాలో అవుతోంది. హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిపిస్తామని వెల్లడించింది. మూడు రోజులూ అతిథులంతా ఇండియన్ స్టైల్ డ్రెస్‌లలోనే కనిపించనున్నారు. జులై 12వ తేదీన Shubh Vivah వేడుక జరగనుంది. ఆ రోజు అతిథులు కచ్చితంగా భారతీయ సంప్రదాయ దుస్తులనే ధరించాలి. మగవాళ్లు పంచెలు, ఆడవాళ్లు చీరలు కట్టుకోవాలని రూల్ పెట్టింది అంబానీ ఫ్యామిలీ. ఆ తరవాత జులై 13వ తేదీన Shubh Aashirwad కార్యక్రమం జరగనుంది. ఆ రోజున ఇండియన్ ఫార్మల్ డ్రెస్ కోడ్ ఫాలో అవాలని చెప్పింది. జులై 14న Indian chic థీమ్‌లో అతిథులు డ్రెసప్ అవ్వాలని తెలిపింది. అంటే...ఇండియన్ టచ్ ఇస్తూ మోడ్రన్ డ్రెస్‌లు వేసుకోవచ్చు. ఇలా మూడు రోజుల పాటు ఒక్కో రోజు ఒక్కో విధంగా డ్రెస్‌కోడ్ పెట్టారు.
క్రూజ్‌లోనూ డ్రెస్ కోడ్..
అటు క్రూజ్ షిప్‌లో జరిగే వేడుకలకూ ఇదే విధంగా డ్రెస్ కోడ్ పెట్టారు. క్యాజువల్ డ్రెస్‌లతో పాటు షార్ట్స్ వేసుకోవచ్చు. హ్యాట్‌లు తప్పనిసరి. డెక్‌లో ఎక్కడ తిరిగినా సరే కచ్చితంగా వీటిని పెట్టుకోవాలి. స్టైల్ కోసమే కాదు. ఎండ వేడిని తట్టుకునేందుకు కూడా ఇవి పనికొస్తాయి. సింపుల్‌గా ఓ షార్ట్, టీషర్ట్ వేసుకుంటే సరిపోతుంది. వైట్, బ్లూ కలర్ డ్రెస్‌లు ఎక్కువగా వేసుకోవాలని అంబానీ ఫ్యామిలీ డ్రెస్ కోడ్ పెట్టింది. వీటితో పాటు స్విమ్‌వేర్ కూడా తెచ్చుకోవచ్చు. క్రూజ్‌లోని స్విమింగ్ పూల్స్‌లో సేదతీరేందుకు ఇవి అవసరమవుతాయి.