Groom looking for a bride : పెళ్లి పందిరి పేరట పత్రికల్లో వచ్చే ప్రకటనలు కుప్తంగా ఉంటాయి. ఎంత ఎత్తు, ఎంత ఆస్తి, ఏ ఉద్యోగం చేస్తారో అన్న విషయాలు షార్ట్ కట్‌లోచ తమకు కావాల్సిన వధువు లేదా వరుడి అర్హతలను కూడా అంతే షార్ట్ కట్‌లో చెబుతారు. కానీ కొంత మంది చాలా పర్టిక్యులర్‌గా ఉంటారు. తాము ఎంత నిజాయతీగా అన్నీ చెబుతున్నామో.. అంతే నిజాయితీగా ఎదుటివారు కూడా ఉండాలనుకుంటారు. అలాంటి వ్యక్తి పత్రికల్లోఇచ్చిన ఓ ప్రకటన ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ ప్రకటనలో ఏముందంటే ?


తాను చాలా తెలివైన యువకుడినని ఇరవై ఏళ్లు మాత్రమేనని పరిచయం చేసుకున్నాడు. మరి బతకడానికి ఏం చేస్తారన్నది కూడా చెప్పాలి కాబట్టి ఉద్యోగం సద్యోగం లాంటివి తన ఒంటికి సరిపవని కానీ.. బోలెడంత సంపాదిస్తానని చెప్పుకొచ్చారు. ఎలా సంపాదిస్తారంటే ఇన్వెస్టింగ్ ద్వారా అట. స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తూ సొంత ఊరు అయిన మీరట్‌లోనే ఉంటూ ఏడాదికి 29 లక్షలు వెనకేస్తున్నానని ఆయన ప్రకటించుకున్నారు. అంతే  కాదు ప్రతి ఏటా తన ఆదాయ వృద్ధి రేటు కనీసం 54 శాతం ఉంటుందన్నారు. ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగావు.. ఏదైనా సర్టిఫికెట్ ఉందా అని ఎవరైనా అడగకండా ప్రకటనలోనే వివరణ ఇచ్చారు సెల్ఫ్ డిస్కవర్డ్, సెల్ఫ్ ధాట్ వర్క్ అని తేల్చేశారు. 


ఇన్వెస్టింగ్ చేయడమే తన ఉద్యోగమని..అదే సేఫ్ బిజినెస్ అని చెప్పుకున్నాడు. ఇదంతా నమ్మడానికి మొత్తంగా పదహారు పేజీల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా రెడీ చేసుకున్నానని ఆసక్తి ఉన్న్ వారు వాట్సాప్ చేస్తే.. పంపుతానని కూడా తెలిపాడు. తాను ఇంత స్పష్టంగా తన గురించి చెప్పాను కాబట్టి.. వధువు కూడా ఎలా ఉండాలో వివరించాడు. ఇంటలిజెంట్ అయి ఉండాలి. ఉద్యోగం చేసినా .. చేయకపోయినా సమస్య లేదని తేల్చేశారు. చివరిలో నో డిమాండ్ కూడా ఓ నోట్ పెట్టారు.అంటే  కట్నం అన్నమాట. కట్నం కూడా వద్దనేశాడు. 



పేరు ఏమీ చెప్పకుండా కేవలం వాట్సాప్ నెంబప్ మాత్రమే ఇచ్చాడు. అయితే ఇదేదో ఇన్వెస్టింగ్ సలహాలు అమ్ముకునేందుకు ఇచ్చిన ప్రకటనలా ఉందన్న అనుమానాలు కొంద మందిలో వ్యక్తమవుతున్నాయి.  పెళ్లి కోసం కాదని.. తన వ్యాపారం కోసం క్లయింట్లను వెదుక్కుంటున్నరన్న సెటైర్లు కూడా పడుతున్నాయి.