Amul Milk Prices Hike: ఇప్పటికే నిత్యావసర వస్తువులపై ధరలు పెరిగాయి. ఇది చాలదన్నట్లు ఇప్పుడు గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) శనివారం రాష్ట్రంలో అమూల్ పాల ధరను లీటరుకు 2 రూపాయలు పెంచింది. డిసెంబర్ 2022లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత పాల ధరలు పెరగడం ఇదే తొలిసారి. గుజరాత్ లోని జీసీఎంఎంఎఫ్.. రాష్ట్రంలోని పాల సహకార సంఘాల అపెక్స్ బాడీ సాధారణంగా పాల ధరల పెంపుదల గురించి ముందుగానే ప్రకటిస్తారు. కానీ ఈసారి నేరుగా పాల ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి ప్రకటన చేయకుండా అమూల్ పాల ధర లీటరుకు 2 రూపాయల చొప్పున పెంచారు. రాష్ట్రంలో పశుగ్రాసం, రవాణా ఖర్చులు పెరగడంతోపాల ఉత్పత్తి వ్యయం పెరిగిన దృష్ట్యా ధరలు పెంచినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
కొత్త ధరలు ఎంతంటే..?
ధరల సవరణ తర్వాత ప్రస్తుతం అమూల్ గేదె పాల ధర లీటరుకు రూ.68కి చేరుకోగా, అమూల్ గోల్డ్ ధర రూ.64కు, అమూల్ శక్తి లీటరుకు రూ.58కి చేరుకుంది. అమూల్ ఆవు పాల ధర ఇప్పుడు లీటరుకు రూ.54కి, అమూల్ తాజా రూ.52కి, అమూల్ టీ-స్పెషల్ లీటరుకు రూ.60కి పెంచారు.
గుజరాత్‌కు మినహాయింపు..
గత ఆరు నెలల్లో, జీసీఎంఎంఎఫ్ భారతదేశం అంతటా వివిధ బ్రాండ్ల అమూల్ పాల ధరలను రెండు సార్లు పెంచింది. అయితే దీని నుంచి గుజరాత్‌కు మినహాయింపు లభించింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు అమూల్ గుజరాత్ మినహా అన్ని మార్కెట్లలో 2022 అక్టోబర్‌లో లీటరుకు రూ. 2, ఆపై ఫిబ్రవరి 2023లో లీటరుకు రూ. 3 పెంచింది. ఇప్పుడు ఈసారి అది చేయలేదు.
ఫిబ్రవరిలోనే 3 రూపాయలు పెంచుతున్నట్లు ప్రకటన
అమూల్ పాల ధరలను లీటరుకు రూ. 3 పెంచినట్లు.. సహకార బ్రాండ్ అమూల్‌ను ప్రమోట్ చేస్తున్న గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఒక ప్రకటనలో తెలిపింది. గత ఏడాది అక్టోబర్‌లో గుజరాత్ మినహా అన్ని రాష్ట్రాల్లో బ్రాండ్ తన ఫుల్‌క్రీమ్ మిల్క్, గేదె పాల ధరలను లీటరుకు 2 రూపాయల చొప్పున పెంచింది. దీనికి ముందు ఆగస్ట్ 2022లో లీటరుకు రూ. 2 పెంచారు. గుజరాత్, ఢిల్లీ ఎన్సీఆర్, పశ్చిమ బెంగాల్, ముంబై, అహ్మదాబాద్, సౌరాష్ట్ర ప్రాంతంలోని అమూల్ పాలను విక్రయించే అన్ని ఇతర మార్కెట్‌లలో పాల ధరలను లీటరుకు రూ. 2 పెంచాలని జీసీఎంఎంఎఫ్ నిర్ణయించిందని ఆనంద్-ప్రధాన కార్యాలయ సమాఖ్య తెలిపింది.
ధరలు పెంచడంతో ప్రస్తుతం అమూల్ గోల్డ్ పాలు లీటర్ ధర 66 రూపాయలు అయింది. అమూల్ తాజా పాలు లీటర్ ధర రూ.54, అమూల్ ఆవు పాటు లీటర్ ధర రూ.56, అమూల్ ఏ2 గేదె పాల ధర లీటర్ రూ.70 కు పెంచుతూ అమూల్ డెయిరీ నిర్ణయం తీసుకుంది. అలాగే దేశ రాజధాని ఢిల్లీతోపాటు దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్) పరిధిలో మదర్ డెయిరీ లీడింగ్ మిల్క్ సప్లయర్, పాలీ ప్యాక్స్, వెండింగ్ మిషన్ల ద్వారా రోజూ 30 లక్షల లీటర్లకుపైగా పాలను విక్రయిస్తోంది. అమూల్ దేశంలోనే లీడింగ్ మిల్క్ సప్లయర్, అమూల్ యజమానులు కూడా లక్షల మంది రైతులే. 75 ఏళ్ల క్రితం రెండు గ్రామాల నుంచి 247 లీటర్ల పాలను సేకరించడంతో మొదలైన అమూల్ ప్రయాణం ఇప్పుడు 260 లక్షల లీటర్లకు దూసుకెళ్తోంది.