Amit Shah On Sardar Patel: సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా సోమవారం దిల్లీలోని సర్దార్ పటేల్ విద్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగించారు. ఈ సందర్భంగా అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశానికి పటేల్‌ను తొలి ప్రధానిగా చేసి ఉంటే ఇప్పుడు ఉన్న అనేక సమస్యలు అసలు ఉండేవి కావని అమిత్ షా అన్నారు.
ఈ సందర్భంగా పటేల్ ఆశయాలను అర్థం చేసుకునేందుకు ఆయన జీవితాన్ని అధ్యయనం చేయాలని విద్యార్థులకు అమిత్ షా సూచించారు.
సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా గుజరాత్‌లోని కెవాడియాలో సోమవారం జరిగిన జాతీయ ఐక్యతా దినోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. 'స్టాట్యూ ఆఫ్ యూనిటీ' వద్ద సర్దార్ పటేల్‌కు నివాళులర్పించారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా కేబుల్ బ్రిడ్జి ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రధాని సంతాపం తెలిపారు.
" ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ దుఃఖ సమయంలో ప్రభుత్వం అన్ని విధాలుగా మృతుల కుటుంబాలకు అండగా ఉంది. గుజరాత్ ప్రభుత్వం నిన్నటి నుంచి సహాయక చర్యలు చేపట్టింది. కేంద్రం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలా సాయం చేస్తోంది. నేను ఏక్తా నగర్‌లో ఉన్నాను కానీ నా మనసు మాత్రం మోర్బీ బాధితులతోనే ఉంది. నా జీవితంలో చాలా అరుదుగా నేను ఇలాంటి బాధను అనుభవించి ఉంటాను. "
Also Read: SC on Two Finger Test: అత్యాచార కేసుల్లో "టూ ఫింగర్ టెస్ట్"పై సుప్రీం బ్యాన్!