Amit Shah calls for using Zoho Mail instead of Gmail: కేంద్ర ప్రభుత్వంలోని ముఖ్యులంతా స్వదేశీ సాఫ్ట్‌వేర్లవైపు మొగ్గు చూపుతున్నారు. ప్రధాని మోదీ ఇచ్చిన స్వదేశీ పిలుపులో భాగంగా మన దేశ సాఫ్ట్ వేర్ కంపెనీ జోహో ఉత్పత్తులను వాడుతున్నారు. ఇప్పటికి అరట్టై మెసెజింగ్ యాప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పుడు మెయిల్ కూడా జోహో మెయిల్ ఉపయోగిచాలని పిలుపునిస్తున్నారు. తాజాగా అమిత్ షా కూడా తన మెయిల్ అడ్రస్ మార్చుకున్నారు.
ప్రధానమంత్రి మోదీ సెప్టెంబర్ 2025లో ‘స్వదేశీ టెక్’ అభియాన్‌ను ప్రారంభించారు. విదేశీ సాఫ్ట్‌వేర్‌లపై ఆధారపడకుండా భారతీయ ప్రొడక్ట్‌లు ఉపయోగించాలని పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రధాని పిలుపున స్పందిస్తూ, స్వదేశీ సాఫ్ట్‌వేర్‌లకు మద్దతుగా జోహో ఉత్పత్తులను ఉపోయోగిస్తున్నట్లుగా ప్రకటించారు. . జోహో కార్పొరేషన్‌కు చెందిన మెసెజింగ్ యాప్ అరట్టై యాప్..రోజువారీ సైనప్‌లు 100 రెట్లు పెరిగాయి. నెటిజన్లు #SwitchToZoho, #VocalForLocal హ్యాష్‌ట్యాగ్‌లతో మద్దతు తెలపడంతో, చిన్న వ్యాపారులు, స్టార్టప్‌లు మెయిల్ మైగ్రేషన్‌ను ప్రారంభించాయి.
జోహో కార్పొరేషన్ 1996లో చెన్నైలో శ్రీధర్ వెంబు, టోనీ థామస్ ప్రారంభించారు. 55కి పైగా క్లౌడ్-బేస్డ్ యాప్‌లతో, మైక్రోసాఫ్ట్ ఆఫీస్, గూగుల్ వర్క్‌స్పేస్‌కు ప్రత్యామ్నాయ ఉత్పత్తులు అందించారు. వ్యాపారులకు అనుకూలం. Zoho Writer, Sheet, Show వంటి ఇంటిగ్రేటెడ్ టూల్స్ ఉంటాయి. జోహో మెయిల్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, మైగ్రేషన్ సులభం. IMAP మెథడ్‌ను సిఫార్సు చేస్తున్నారు, ఇది సర్వర్-టు-సర్వర్ ప్రాసెస్. డేటా లాస్ లేకుండా, ఫోల్డర్ స్ట్రక్చర్, ఈమెయిల్ స్టేటస్ ప్రిజర్వ్ అవుతాయి.