Lakshadweep Flights: 


అదనపు ఫ్లైట్స్..


మాల్దీవ్స్‌కి ట్రిప్‌లు రద్దు చేసుకుంటున్న భారతీయులు లక్షద్వీప్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మధ్య గూగుల్‌ సెర్చ్‌లో లక్షద్వీప్‌ గురించే అంతా వెతుకుతున్నారు. అక్కడ టూరిస్ట్ స్పాట్‌లు ఏమేం ఉన్నాయి..? ఎంత ఖర్చవుతుంది..? ఎలా వెళ్లాలి..? ఇలా అన్ని వివరాలు తెలుసుకుంటున్నారు. ఈ ట్రెండ్‌కి తగ్గట్టుగానే ఎయిర్‌లైన్స్ సంస్థలు స్పందిస్తున్నాయి. లక్షద్వీప్‌కి ఫ్లైట్ సర్వీస్‌లను పెంచేలా ప్లాన్ చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే Alliance Air సంస్థ కీలక ప్రకటన చేసింది. లక్షద్వీప్‌కి వెళ్లాలనుకునే ఇండియన్స్‌కి గుడ్‌ న్యూస్ చెప్పింది. అదనంగా మరి కొన్ని ఫ్లైట్‌లను నడుపుతామని ప్రకటించింది. అఫీషియల్ X అకౌంట్‌లో ఈ విషయం వెల్లడించింది. Alliance Air కంపెనీ ఇప్పటికే రోజూ లక్షద్వీప్‌కి ఫ్లైట్‌ సర్వీస్‌లు నడుపుతోంది. 70 సీటర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే...గతేడాది మార్చి నుంచి ఈ ఫ్లైట్స్‌కి ఫుల్ డిమాండ్ ఉంటోందట. మొత్తం సీట్‌లన్నీ బుక్ అయిపోతున్నాయని సంస్థ స్పష్టం చేసింది. ఈ డిమాండ్‌ని దృష్టిలో పెట్టుకుని అదనంగా ఫ్లైట్స్‌ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆసక్తి చూపిస్తోంది. వారానికి రెండు రోజులు ఆదివారం, బుధవారం ఈ ఎక్స్‌ట్రా ఫ్లైట్స్‌ నడుపుతామని తెలిపింది. కేరళలోని కొచ్చి నుంచి లక్షద్వీప్‌లోని అగత్తి ద్వీపం వరకూ ఈ సర్వీస్‌లు అందుబాటులో ఉంటాయి. 


"కొద్ది రోజులుగా మాకు చాలా ఫోన్ కాల్స్,మెసేజ్‌లు వస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ టికెట్స్‌ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ టికెట్స్‌కి డిమాండ్‌ని దృష్టిలో పెట్టుకుని అదనపు ఫ్లైట్స్‌ని అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఈ డిమాండ్ ఇంకా పెరిగితే ఫ్లైట్స్ సంఖ్యని మరింత పెంచుతాం"


- అలియన్స్ ఎయిర్ సంస్థ






మోదీ పర్యటనతో డిమాండ్..


ఇప్పటికే Spice Jet సంస్థ కూడా లక్షద్వీప్‌కి ఫ్లైట్స్‌ నడుపుతామని వెల్లడించింది. ఇటీవల జరిగిన ఓ మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకుంది. మిగతా ట్రావెల్ పోర్టల్స్‌లోనూ లక్షద్వీప్ గురించి ఎంక్వైరీలు పెరిగాయి. MakeMyTrip ప్రకారం...ఈ మధ్య కాలంలో లక్షద్వీప్‌ గురించి వెతికిన వాళ్ల సంఖ్య 3400% మేర పెరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే లక్షద్వీప్‌లో పర్యటించారు. అందరూ ఇక్కడికి రావాలని కోరారు. అప్పటి నుంచి భారత్‌, మాల్దీవ్స్ మధ్య వివాదం మొదలైంది. మాల్దీవ్స్ మంత్రులు కొందరు ప్రధాని మోదీపై నోరు పారేసుకున్నారు. వెంటనే తప్పు దిద్దుకున్న అక్కడి ప్రభుత్వం ఆ మంత్రులను సస్పెండ్ చేసింది. 


ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం...ఇక్కడ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఏమేం చేయొచ్చో అధికారులు కేంద్ర ప్రభుత్వానికి కొన్ని ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతానికి లక్షద్వీప్‌లో అగట్టి ద్వీపంలో ఎయిర్‌ స్ట్రిప్ అందుబాటులో ఉంది. అయితే...పెద్ద ఎయిర్‌క్రాఫ్ట్‌లు ల్యాండ్ అయ్యేలా మినికాయ్ ఐల్యాండ్‌లో కొత్తగా ఎయిర్‌పోర్ట్ నిర్మించాలని ప్రణాళికలు రచిస్తోంది ప్రభుత్వం. Smart City projectలో భాగంగా కొన్ని చోట్ల హోటల్ ప్రాజెక్ట్‌లకూ అనుమతినిచ్చే యోచనలో ఉంది. విదేశీయులు వచ్చినా సౌకర్యవంతంగా ఉండేలా పెద్ద హోటళ్లు నిర్మించాలని ప్లాన్ చేస్తోంది.


Also Read: Ram Mandir: భారత్‌లో ఆధ్యాత్మిక పర్యాటకానికి పెరిగిన డిమాండ్, అయోధ్యతో మరింత జోష్