Hanuman First Day Collections: 'జాంబిరెడ్డి' ఫేం ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన లేటెస్ట్‌ మూవీ హనుమాన్‌. ఈ సంక్రాంతి పండుగ కానుకగా థియేటర్లోకి వచ్చిన ఈ మూవీ ఊహించని రెస్సాన్స్‌ అందుకుంది. గుంటూరు కారం రూపంలో బలమైన పోటీ ఉన్నప్పటికీ ఈ మూవీ హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. విడుదలకు ముందు ప్రీమియర్‌ షో వేసి ధైర్యం చేశాడు ప్రశాంత్‌  వర్మ. మూవీ టీం నమ్మినట్టుగానే మూవీ పాజిటివ్‌ రివ్యూస్‌ తెచ్చుకుని బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టింది. తక్కువ థియేటర్లో విడుదలైనప్పటికీ ఈ మూవీ షాకింగ్ వసూళ్లు రాబట్టింది. 11 భాషల్లో పాన్‌ ఇండియాగా వచ్చిన హనుమాన్‌ అన్ని భాషల్లోనూ హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. దానికి తగ్గట్టుగానే ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ కూడా భారీగా చేసినట్టు తెలుస్తోంది. ప్రీమియర్స్ ద్వారానే హనుమాన్‌ దాదాపు 2 కోట్ల 50 లక్షల షేర్ చేసినట్టు సమాచారం. విడుదలైన మొదటి రోజు ఈ మూవీ మరింత దూకుడు చూపించింది. 


తక్కువ థియేటర్లలో విడుదలైనప్పటికీ ఈ మూవీ ఫస్ట్‌ డే వరల్డ్ వైడ్‌గా రూ. 21కోట్లు చేసినట్టు సినీ విశ్లేషకుల అంచనా. దీంతో మూవీకి మరిన్ని థియేటర్లు పెంచనున్నట్టు సమాచారం. ఇక దేశవ్యాప్తంగా హనుమాన్  రూ. 7 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసినట్టు ట్రేడ్ పండితులు నుంచి సమాచారం.  నైజాం ఏరియాలో దాదాపు 3.66 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇక ఉత్తరాంధ్ర గుంటూరు కృష్ణ వంటి ఏరియాలలో కూడా సినిమాకు సాలిడ్ కలెక్షన్స్ వచ్చాయి. అయితే, ఇవి కేవలం అంచనాలు మాత్రమే. మూవీ టీం నుంచి కలెక్షన్లపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అప్పుడే హనుహన్‌ కలెక్షన్లపై క్లారిటీ వస్తుంది. 


ఇక కర్ణాటకలో అయితే హనుమాన్‌ కోటికి పైగా షేర్ కలెక్షన్స్ చేసిందని సమాచారం. అక్కడ పెద్దగా బజ్ లేకపోయినప్పటికీ మొదటి రోజు పాజిటివ్ టాక్ రావడంతో సాయంత్రం షోలకు హౌస్ ఫుల్ అయ్యాయట. మరోవైపు హిందీలోనూ ఈ మూవీ మంచి  రెస్పాన్స్‌ వస్తుంది. అంతేకాదు అక్కడ హనుమాన్‌ థియేటర్ల సంఖ్య కూడా పెంచే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఓవర్సీస్ లో కూడా హనుమాన్ సినిమా 3.55 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ అందుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.


ఓవర్సిస్‌లోనూ భారీ రెస్పాన్స్‌


హనుమాన్ సినిమాకు యూఎస్‌లోనూ భారీగా స్పందన వస్తోంది. ప్రధానంగా హనుమాన్ సినిమా ప్రీమియర్ షోలకు అక్కడ 297 లొకేషన్లలో 553 షోలు ప్రదర్శించారట. దీంతో ఫస్ట్‌ డే అక్కడ హనుమాన్‌ సుమార్‌ 200k పైగా డాలర్స్‌ కలెక్షన్‌ చేసినట్టు సమాచారం. కాగా హనుమాన్‌ను దాదాపు రూ. 30పైగా కోట్ల బడ్జెట్‌ తెరెక్కించినట్టు సమాచారం. హనుమంతుడి సెంటిమెంట్‌తో సూపర్‌ కాన్సెప్ట్‌ తీసిన ఈసినిమాలో వీఎఫ్‌ఎక్స్‌కు పెద్దపీట వేశారు. వీఎఫ్ఎక్స్‌ విజువల్స్‌ చాలా సహజంగా కనిపించడంతో అంతా ఆదిపురుష్‌ డైరెక్టర్‌ని టార్గెట్‌ చేశారు. తక్కువ బడ్జెట్‌ అయినప్పటికీ వీఎఫ్‌ఎక్స్‌ చాలా బాగా వాడారని, గ్రాఫిక్స్‌ అనే ఫీల్‌ రాకుండా తీశారన్నారు. ఆదిపురుష్ కంటే హనుమాన్‌ వందరేట్లు బేటర్‌ అంటూ ఓంరౌత్‌కు చురకలు అంటిస్తున్నారు.


Also Read: ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ - పెద్ద పండక్కి సందడి