అర్హులైన ప్రతి జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని అదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న వెల్లడించారు. బట్టి సావర్గామ గ్రామపంచాయతీ పరిధిలో ఆదివారం ఎమ్మెల్యే జోగు రామన్న ఇళ్ల స్థలాల కోసం భూమి పూజ చేశారు.
ఆదిలాబాద్ జర్నలిస్టులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఇండ్ల స్థలాల కల నెరవేరిందని ఎమ్మెల్యే రామన్న అన్నారు. ముందుగా జర్నలిస్ట్ జేఏసీ సభ్యులు ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ . ఆదిలాబాద్ లో ఎన్నో ఏళ్లుగా ఇంటి స్థలాల కోసం జర్నలిస్టులు చేసిన పోరాటం ఫలించింది అని అన్నారు. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు కేటాయిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. జర్నలిస్టుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించామని ఆయన పేర్కొన్నారు. జర్నలిస్టులకు స్థలాల కేటాయింపు నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. జేఏసీ పోరాటంతో పాత్రికేయుల సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. అదేవిధంగా జేఏసీ కన్వీనర్ దేవేందర్ మాట్లాడుతూ జర్నలిస్టుల కోసం ఇంటి స్థలాల కేటాయింపులు ప్రత్యే ప్రత్యేక చొరో చూపిన ఎమ్మెల్యే జోగమ్మ అన్నకు ధన్యవాదాలు తెలియజేశారు.
ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర అమోఘం
తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో ఆమోఘమైందని ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమ నేత కేసీఆర్ చేసిన పోరాటంలో జర్నలిస్టుల పాత్ర గొప్పదని గుర్తుచేశారు. ఉ ద్యమ సమయంలో టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు అల్లం నారాయణ పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల మంది జర్నలిస్టులు కదిలి ఉద్యమ నేత కేసీఆర్‌తో కలిసి కదం తొక్కారని గుర్తుచేశారు. సిఎం కేసిఆర్ సహకారంతో ఇండ్ల స్థలాలకు కృషి చేస్తామన్నారు. తెలంగాణ సర్కారుతో జర్నలిస్టు లది తల్లీబిడ్డల అనుబంధమని ఎమ్మెల్యే అన్నారు.
కరోనా సమయంలో ఈ సంక్షేమ నిధి జర్నలిస్టులకు ఎంతగానో ఉపయోగపడిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు ఉన్న ప్రధాన సమస్య ఇళ్ల స్థలాల సమస్య అని అన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన జర్నలిస్టుల ఏకైక సమస్య ఇళ్ల స్థలాలదేనని తెలంగాణ మీడియా అని జోగు రామన్న అన్నారు. దానిని సాధించుకోవడమేనని తమ ఏకైక ఎజెండా అని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ ఇల్లు లేని వారందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని నిర్ణయించుకోవడం చాలా ఆనందదాయకమని జర్నలిస్టులు చెప్పారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది జర్నలిస్టులకు సొంత ఇల్లు లేకపోవడంతో… అద్దెలు చెల్లించలేని ధీనస్థితిలో, చాలీచాలని జీతాలతో ఉన్నారని వారందరిని ఆదుకోవాలని కోరారు. ఒకవేళ సొంత పత్రికలు కలిగి ఉన్నా వారికి ఎలాంటి ప్రభుత్వ ప్రకటనలు అందకపోవడంతో.. చాలా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారని చెప్పారు.
ప్రభుత్వం జర్నలిస్టుల సొంత ఇంటి కల నెరవేరుస్తారని, జర్నలిస్టులు వేయికళ్ళతో ఎదురు చూస్తున్నారని వెల్లడించారు. జర్నలిస్టుల న్యాయమైన కోరికను రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల భూమి పూజ చేసిన ఎమ్మెల్యే జోగు రామన్నకు జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కో కన్వీనర్ వెంకటేష్, జేఏసీ సభ్యులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు కేమెరా మేన్స్, ఫోటోగ్రాఫర్లు తదితరులు పాల్గొన్నారు.