Viral Video: లిక్కర్ బాటిల్స్‌ ఫ్రీగా పంపిణీ చేసిన బీజేపీ ఎంపీ, ఎగబడ్డ జనం - వీడియో వైరల్

BJP MP K Sudhakar: కర్ణాటక బీజేపీ ఎంపీ తన నియోజకవర్గం ఉచితంగా లిక్కర్ బాటిల్స్ పంపిణీ చేశారు. ఈ బాటిల్స్ కోసం జనం ఎగబడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

Continues below advertisement

Karnataka News: ఎన్నికల్లో గెలిచాక పార్టీ కార్యకర్తలకు,ఫ్యాన్స్‌కి పార్టీలివ్వడం కామనే. కానీ బీజేపీ ఎంపీ మాత్రం ఏకంగా ఓపెన్‌గా అందరికీ లిక్కర్ బాటిల్స్ సప్లై చేశాడు. కార్యకర్తలంతా క్యూ కట్టి మరీ ఆ సీసాలు పట్టుకెళ్లారు. చిక్కబళ్లాపూర్‌లో ఈ ఘటన జరిగింది. ఎంపీ కే సుధాకర్ ఈ పార్టీ అరేంజ్ చేశాడు. అందరికీ ఫ్రీగా ఆల్కహాల్ ఆఫర్ చేశాడు. అలా చెప్పాడో లేదో అంతా వచ్చి వరుసలో నిలబడ్డారు. ఒక్కొక్కరూ బాటిల్‌ తీసుకుని వెళ్లిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వ్యవహారం పోలీసుల వరకూ వెళ్లింది. ఇలా ఎలా అనుమతించారని విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌ అనుమతి ఇచ్చిందని, పోలీసుల నుంచి అనుమతి తీసుకోలేదని డిపార్ట్‌మెంట్ క్లారిటీ ఇచ్చింది. అంతే కాదు. పోలీసులే దగ్గరుండి ఈ ఏర్పాట్లు చూసుకోవాలని ఆదేశాలిచ్చారని స్పష్టం చేసింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా వివాదాస్పదమవుతోంది. 

Continues below advertisement

"ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ దీనికి పర్మిషన్ ఇచ్చింది. పోలీసులే ఇదంతా దగ్గరుండి చూసుకోవాలని ఆదేశించారు. ఇందులో పోలీసుల తప్పేమీ లేదు. అనవసరంగా డిపార్ట్‌మెంట్‌ని నిందించొద్దు. ఇలాంటి వాటికి అనుమతి ఇవ్వాలా వద్దా అన్నది ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌ పరిధిలో ఉంటుంది"

- పోలీసులు

 

 

Continues below advertisement