AP Inter First Year Admissions 204-25: ఏపీలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తు గడువును ఇంటర్ బోర్డు మరోసారి పొడిగించింది. అన్ని కళాశాలల్లో జులై 31 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని ఇంటర్ బోర్డు కార్యదర్శి నిధిమీనా ఒక ప్రకటనలో తెలిపారు. ఇదే ఆఖరి విడతని, మరోసారి గడువు పెంచబోమని స్పష్టం చేశారు.
కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తున్న సంగతి తెలిసిందే. మే 22 నుంచి జూన్ 1 వరకు మొదటి విడత ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జరిగింది. జూన్ 1 వరకు మొదటి విడత ప్రవేశాలు, జులై 1 వరకు రెండో విడత ప్రవేశాలు జరిగాయి. ఇప్పటికే ఒకసారి పొడిగించగా.. తాజాగా మరోసారి పొడిగించారు. ఎలాంటి రాత పరీక్షలు నిర్వహించకుండా కేవలం పదోతరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా మాత్రమే ఇంటర్ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ ఏడాది ఏపీలో వేసవి సెలవులు అనంతరం జూన్ 1 నుంచి ఇంటర్ కళాశాలలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ విద్యా సంవత్సరం అకడమిక్ క్యాలెండర్ ప్రకారం మొత్తం 222 పని దినాలుగా ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ప్రకటించిన క్యాలెండర్ ప్రకారం ఈ విద్యాసంవత్సరంలో అక్టోబర్ 3 నుంచి 11 వరకు దసరా సెలవులు ఇవ్వనున్నారు. అయితే అక్టోబరు అక్టోబరు 12న రెండో శనివారం, 13న ఆదివారం రావడంతో మొత్తం 10 రోజులపాటు దసరాసెలవులు రానున్నాయి. అలాగే వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 18 వరకు ఆరురోజులపాటు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నారు. అదేవిధంగా ఏప్రిల్ 1 నుంచి జూన్ 1 వరకు వేసవి సెలవులగా అకడమిక్ క్యాలెండర్‌లో పేర్కొన్నారు.
ALSO READ: ఇంజినీరింగ్ చదివే విద్యార్థులకు 18 వేల స్కాలర్‌షిప్- డిప్లొమా స్టూడెంట్స్‌కి కూడా ఇస్తారు!
ఏపీ ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ ఇలా..
➥ యూనిట్-1 పరీక్షలు: 29.07.2024 - 31.07.2024.
➥ యూనిట్ -2 పరీక్షలు: 29.08.2024 - 31.08.2024.
➥ త్రైమాసిక (క్వార్టర్లీ) పరీక్షలు: 23.09.2024 - 28.09.2024.
➥ దసరా సెలవులు: 03.10.2024 - 11.10.2024. (అక్టోబరు 12 రెండో శనివారం. 13 ఆదివారం)
➥ దసరా సెలవుల తర్వాత కళాశాలల పునర్ ప్రారంభం: 14.10.2024 (సోమవారం).
➥ యూనిట్ -3 పరీక్షలు: 21.10.2024 - 23.10.2024.
➥ యూనిట్ -4 పరీక్షలు: 21.11.2024 - 23.11 .2024.
➥ స్పోర్ట్స్ వీక్: నవంబరు చివరివారంలో.
➥ అర్థవార్షిక (హాఫ్ ఇయర్లీ) పరీక్షలు: 16.12.2024 - 21.12.2024.
➥ సైన్స్ అండ్ ఇన్నేవేషన్ ఫెయిర్: 08.01.2025 - 09.01.2025.
➥ సంక్రాంతి సెలవులు: 13.01.2025 - 18.01.2025. (జనవరి 19 ఆదివారం)
➥ సంక్రాంతి సెలవుల తర్వాత కళాశాలల పునర్ ప్రారంభం: 20.01.2025.
➥ ప్రీఫైనల్ పరీక్షలు: 03.02.2025 - 10.012.2025.
➥ ఇంటర్ ప్రాక్టికల్స్: 2024 ఫిబ్రవరి రెండవ వారం నుంచి.
➥ ఇంటర్ వార్షిక పరీక్షలు: 2025, మార్చ్ మొదటి వారం నుంచి.
➥ జూనియర్ కాలేజీలకు చివరి పనిదినం (లాస్ట్ వర్కింగ్ డే): 31.03.2024.
➥ వేసవి సెలవులు: 01.04.2025 - 01.06.2025 వరకు.
➥ అడ్వాన్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు: 2025, మే రెండోవారం నుంచి.
➥ కళాశాలల పునర్ ప్రారంభం: 02.06.2024
ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ (2024-25) కోసం క్లిక్ చేయండి..