Air India News: ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లోని ఓ ప్యాసింజర్ తన బ్యాగ్‌లో బాంబ్ ఉందని అందరినీ టెన్షన్ పెట్టాడు. చెకింగ్ పాయింట్‌ వద్ద ఈ కామెంట్స్ చేయడం వల్ల ఒక్కసారిగా సెక్యూరిటీ అలెర్ట్ అయింది. వెంటనే ఆ వ్యక్తిని అరెస్ట్ చేసింది.  కేరళలోని కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వద్ద ఈ ఘటన జరిగింది. కొచ్చి నుంచి ముంబయికి వెళ్తున్న మనోజ్ కుమార్ సెక్యూరిటీ చెక్‌ వద్ద వాగ్వాదానికి దిగాడు. బ్యాగ్‌లో బాంబుందేమో చెక్ చేసుకోండి అన్నాడు. ఈ మాట వినగానే అంతా అప్రమత్తమయ్యారు. బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్‌ వెంటనే అక్కడికి వచ్చింది. బ్యాగ్ చెక్ చేసి బాంబు లేదని కన్‌ఫమ్ చేసింది. ఆ తరవాత అంతా ఊపిరి పీల్చుకున్నారు. మనోజ్‌ని అరెస్ట్ చేసిన CISF సిబ్బంది పోలీసులకు అప్పగించింది.  


ఎయిర్‌పోర్ట్‌లలో బాంబ్‌, హైజాక్ లాంటి పదాల్ని చాలా తీవ్రంగా పరిగణిస్తారు. ఎవరు వీటి గురించి మాట్లాడినా అనుమానితులుగానే చూస్తారు. ఇలాంటి విషయాల్లో జోక్‌లు చేయడం తగదని, ఊరికే కూడా ఎవరూ ఈ పదాలు అక్కడ మాట్లాడకూడదని అధికారులు స్పష్టం చేశారు. ఇది సెక్యూరిటీకి సంబంధించిన విషయమని తేల్చి చెప్పారు. తమ బ్యాగ్‌లో బాంబు ఉందని ఎవరు కామెంట్ చేసినా సీరియస్‌గా తీసుకుంటామని అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశంలోని అన్ని రైల్వే స్టేషన్‌లు, ఎయిర్‌పోర్ట్‌ల వద్ద భద్రత పెంచారు. ఇప్పటి నుంచే నిఘా పెట్టారు. ఇలాంటి సమయంలో ఈ ఘటన జరగడం వల్ల సంచలనమైంది. అంతకు ముందు కూడా కొచ్చి నుంచి లండన్‌కి వెళ్తున్న ఫ్లైట్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. తన కూతురుకి ఫుడ్ పాయిజనింగ్ అయిందని చెప్పినా ఫ్లైట్‌ మార్చేందుకు సిబ్బంది ఒప్పుకోలేదు. దీంతో విసిగిపోయిన ప్యాసింజర్‌ బ్యాగ్‌లో బాంబు ఉందని చెప్పాడు. ఆ తరవాత అదంతా కావాలనే చేసినట్టు తేలింది. వెంటనే ఆ ప్యాసింజర్‌ని అరెస్ట్ చేశారు. 


Also Read: Viral News: గ్రౌండ్‌లో క్రికెట్ ఆడుతూ పోల్ పట్టుకున్న బాలుడు, ఎలక్ట్రిక్ వైర్ తగిలి అక్కడికక్కడే మృతి