అహ్మదాబాద్‌లో ఈ మధ్యాహ్నం జరిగిన దుర్ఘటన భారత్‌లో  జరిగిన అతి పెద్ద విమాన ప్రమాదంగా నిలవనుంది, ఇప్పటి వరకూ దీనికి కారణాలు ఏంటన్నది  కచ్చితంగా ఇప్పుడే చెప్పలేకున్నారు. ఎయిర్ ఇండియా నిర్వహణ లోపం ఉందా సాంకేతిక లోపం ఉందా.. లేక ఇంకేదైనా కారణాలున్నాయా అన్నది ముందు మందు దర్యాప్తులో తేలుతుంది. అయితే ఆ ఎయిర్‌ క్రాప్ట్ నిర్వహణ సరిగ్గా లేదంటూ ఓ ప్రయాణికుడు పెట్టిన వీడియో ఇప్పుడు ఆన్‌లైన్లో సంచలనంగా మారింది. ఎక్కువ మంది దానిపైనే కామెంట్లు చేస్తున్నారు.

ఆ ఫ్లైట్‌లో నేను ప్రయాణించా.. మెయింటెనెన్స్ బాలేదు

అహ్మదాబాద్‌ నుంచి లండన్ వెళ్లాల్సిన  AI 171 సర్వీస్ ఇవాళ మధ్యాహ్నం అహ్మదాబాద్‌లో ఎయిర్‌పోర్టు సమీపంలోనే కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే. రెండు ఇంజన్లు పని చేయకపోవడం వల్ల ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అనుకుంటున్నారు. ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయోమో అప్పుడే తెలీదు. అయితే ఎయిర్ ఇండియా విమాన నిర్వహణ అధ్వాన్నంగా ఉందని... స్వయంగా తాను ఆ ఫ్లైట్‌లో ప్రయాణించానంటూ ఓ ప్రయాణికుడు వీడియోలను Xవేదికగా పోస్ట్ చేశాడు. Akash Vatsa అనే విమాన ప్రయాణికుడు అదే ఫ్లైట్‌లో తాను ఇవాళ ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌ నుంచి వచ్చానని...  చెప్పాడు. “I was in the Same Damn flight 2 Hours before it took off from AMD” ఇని అతను Xలో రాశాడు. అహ్మదాబాద్‌ నుంచి టేకాప్ అవ్వడానికి ముందు అది ఢిల్లీ నుంచి వచ్చిందని చెబుతున్నాడు.

ఢిల్లీ నుంచి వస్తున్నప్పుడే ఫ్లైట్ అధ్వాన్నంగా ఉందని అందులో AC పనిచేయడం లేదని... In flight టీవీ స్క్రీన్‌లు, కాబిన్ క్రూను పిలిచే బటన్స్, ఏవీ పనిచేయడం లేదంటూ Akash వీడియో తీశాడు. అంతే కాదు.. ఫ్లైట్ దిగిన తర్వాత దానిని బయట నుంచి కూడా వీడియో తీశాడు. ఇదంతా AirIndia ను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పెడదామని తాను వీడియో తీశానని .. కానీ ఇది ఆ ఫ్లైట్ ఏకంగా కూలిపోయిందని వీడియో పోస్ట్ చేశాడు. క్షణాల్లోనే ఇది వైరల్ అయింది. ఇప్పటికే 2 మిలియన్లకు పైగా ఆ వీడియోను చూశారు. చాలా మంది ఏసీ, ఎంటర్‌టైన్‌ మెంట్ స్క్రీన్‌లు పనిచేయకపోవడానికి ఎయిర్‌లైన్స్ క్రాష్‌ కు సంబంధం ఏంటని ప్రశ్నిస్తుండగా.. కొంతమంది ఎయిర్‌ ఇండియా తన ఫ్లైట్లను ఎలా నిర్వహిస్తుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని అంటున్నారు. మరి కొంతమంది అసలు అవి రెండు ఒకే ఫ్లైట్ అని ఎలా చెబుతాం అంటున్నారు. ప్రయాణికుడు అకాష్ వీడియోని ఎవ్వరూ నిర్థారించలేదు. ఎయిర్ ఇండియా ఇవాళ ఢిల్లీ నుంచి ప్లైట్లను నడిపింది కానీ..ఇది అదే విమానమా అన్నది చెప్పలేం.  ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చే విమానానికి ఈ సర్వీసు నెంబర్ లేదు. అహ్మదాబాద్ నుంచి లండన్ కోసం సర్వీసు నెంబర్ మార్చి ఉండొచ్చు.

బోయింగ్ విమానాల సిరీస్‌లో 787 అనేది అత్యంత సురక్షితమైంది.  ప్రమాదాలను నివారించడానికి చాలా వ్యవసస్థలుంటాయి. ఇప్పటి వరకూ.. 787 కు ఇలాంటి ప్రమాదం జరగలేదని ఎయిర్ లైన్స్ నిపుణులు చెబుతున్నారు. గురువారం జరిగిన ఈ ప్రమాదం... అతిపెద్ద విమాన ప్రమాదాల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. ప్రమాద సమయంలో 242 మంది విమానంలో ఉన్నారు. ఇందులో ఇద్దరు పైలట్లు, 10మంది విమాన సిబ్బంది. 169మంది భారతీయులు, 53మంది బ్రిటిషర్లు, ఓ కెనడియన్, 7గురు పోర్చుగల దేశస్తులు ఉన్నారు.