Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode సహస్ర కొబ్బరి పెంకులు దారిలో పడేయటంతో లక్ష్మీ కాళ్లకు గుచ్చుకొని రక్తం వస్తుంది. దాంతో విహారి లక్ష్మీని ఎత్తుకొని తీసుకెళ్తాడు. ఎవరైనా చూస్తే బాగోదు అని లక్ష్మీ  అంటే భర్త భార్యని ఎత్తుకోవడం తప్పు కాదు అని విహారి లక్ష్మీని ఎత్తుకొని తీసుకెళ్తాడు. 

లక్ష్మీ, విహారిలను ఆదికేశవ్, గౌరీలు చూస్తారు. ఇద్దరినీ పలకరిస్తారు. అల్లుడు కూతుర్ని కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నారు అని ఆదికేశవ్ అంటాడు. ఏమైందని గౌరీ అడిగితే లక్ష్మీ కాలికి కొబ్బరి చిప్ప తగిలిందని చెప్తాడు విహారి. దాంతో ఆదికేశవ్ లక్ష్మీ కాలు పట్టుకొని చూసి పసుపు రాస్తారు. లక్ష్మీని తీసుకొని వెళ్తారు. అందతా సహస్ర చాటుగా చూస్తుంది. యమున పండుని కొత్త బట్టలు తీసుకురమ్మని చెప్తే పండు తీసుకొస్తాడు. యమున పండుని కూడా గుడికి రమ్మని చెప్తుంది. ఇప్పుడు ఎందుకు అని పండు అడిగితే ఆదికేశవ్, గౌరీల కూతురు అల్లుడు వ్రతం చేసుకుంటున్నారు రమ్మని చెప్పారు వెళ్లి త్వరగా వచ్చేద్దాం అని అంటుంది.

పండు ఆపడానికి చాలా ప్రయత్నిస్తాడు. కానీ యమున వెళ్దాం అని పండుని తీసుకెళ్తుంది. మరోవైపు అంబిక సహస్ర ప్రవర్తన గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో సిద్దార్థ్ ఇంటికి వస్తాడు. బంగారు పాప ఉండేది ఇక్కడేనా అబ్బో బాగా రిచ్‌ పాప అనుకుంటాడు. డైనింగ్ టేబుల్ మీద కూర్చొని టిఫెన్ చేస్తుంటాడు. ఇంతలో అంబిక చూస్తుంది. వీడేంటి ఇలా వచ్చేశాడు అని ప్రశ్నిస్తుంది. నీ దగ్గరకు వస్తే కడుపు నిండా అన్నం పెడతావ్ ఖర్చులకు డబ్బు కూడా ఇస్తావ్ అని అంటాడు. నువ్వు నా ఏటీఎం మెషన్ నాకు డబ్బులు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఇస్తావ్ అని అంటాడు. అంబికకు డబ్బులు తీసుకురమ్మని అంటాడు. నా దగ్గర లేవు అంటే ఏదో ఒకటి చేసి నాకు డబ్బులు ఇవ్వు లేదంటే నా దగ్గర ఉన్న సాక్ష్యాలు వైరల్ చేస్తాను అంటాడు. 

అంబిక సిద్దార్థ్‌ని బతిమాలుతుంది. డబ్బు ఏర్పాటు అవ్వగానే చెప్తానని అంటుంది. సిద్దార్థ్ వెళ్లిపోగానే పద్మాక్షి వస్తుంది. అంబిక టిఫెన్ చేసినట్లు నటిస్తుంది. సహస్ర, విహారి వస్తే నన్ను పిలువు అని చెప్పి పద్మాక్షి వెళ్లిపోతుంది. ఇక విహారి, లక్ష్మీలకు పంతులు గుడి చుట్టూ ప్రదక్షిణ చేయమని చెప్తారు. యమున వాళ్లు గుడికి వచ్చేస్తాడు. పండు చాలా టెన్షన్ పడతారు. సహస్ర లక్ష్మీని పంపేయడానికి తన నడుం విరగ్గొట్టాలి అని దీపం నూనె దారికి అడ్డంగా వేస్తుంది. లక్ష్మీ, విహారి అటుగా వస్తారు కానీ మొదట లక్ష్మీ ఆయిల్ తొక్కకుండా వెళ్లిపోతుంది. లక్ష్మీ జారిపోలేదు ఏంటి నూనె పోశానా లేదా అని ట్రై చేస్తే సహస్ర జారిపోయి యమున మీద పడుతుంది. 

యమున సహస్రని ప్రశ్నిస్తే నా జాతకం బాలేదని అన్నారు కదా అందుకే అమ్మవారిని దర్శించుకోవాలని వచ్చానని అంటుంది. మీరేంటి ఇక్కడ అని సహస్ర అడిగితే ఆదికేశవ్‌ వాళ్ల కూతురి అల్లుడి వ్రతానికి పిలిచారు అని అంటుంది. అత్తయ్య వాళ్లని చూసేస్తే ఇక అంతే అనుకుంటుంది. విహారి, లక్ష్మీ ప్రదక్షిణలు చేస్తుంటే అటుగా వచ్చిన ఒకామె చేతిలో పసుపు కుంకుమ విహారి, లక్ష్మీ మీద పడిపోతుంది. ఇద్దరి ముఖాలు పసుపు, కుంకుమలతో నిండిపోతాయి. అప్పుడే అటుగా వచ్చిన సహస్ర, యమున, పండులను విహారి వాళ్లు చూసి షాక్ అయిపోతారు. చాలా కంగారు పడతారు. 

విహారి లక్ష్మీతో ఈ పసుపు కుంకుమలే మనల్ని కాపాడాయి అనుకుంటాడు. ఆదికేశవ్, గౌరీలు అమ్మాయి అల్లుడు ఏరి అనుకుంటే అక్కడే ఉన్న లక్ష్మీ, విహారిలు మేమే అని చెప్తారు. యమున వాళ్లు రావడంతో ఆదికేశవ్ యమునకు విహారి, లక్ష్మీలను పరిచయం చేస్తాడు. లక్ష్మీ, విహారిలను ఆదికేశవ్ యమున దగ్గర ఆశీర్వాదం తీసుకోమని అంటారు. విహారి, లక్ష్మీ ఇద్దరూ యమున దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. యమున ఆశీర్వదించగానే సహస్ర మా అత్తయ్య నన్ను బావని కూడా ఇంతలా ఆశీర్వదించలేదు అని ఫీలైపోతుంది. ఇక యమున ఆదికేశవ్‌తో మీ అమ్మాయి అల్లుడికి బట్టలు తీసుకొస్తున్నా అని చెప్తుంది. ఇద్దరికీ బట్టలు పెడుతుంది. ఇద్దరూ తీసుకుంటారు. 

విహారి, లక్ష్మీలు వ్రతానికి రెడీ అవుతారు. అమ్మకి నిజం తెలిసిపోయి ఉంటే మా తప్పిన కొడుకుగా మోసం చేసిన కొడుకుగా నేను ఎప్పటికీ తల ఎత్తుకోలేకపోయే వాడిని అని అంటాడు. మీరు ఎప్పటికీ తల దించుకోరని లక్ష్మీ అంటే నీకు నా మీద అభిమానంతో గుర్తించడం లేదు కానీ నేను ప్రతీ రోజు అబద్ధాలే చెప్తున్నా అని అంటాడు. మీ అబద్ధాలకు కారణం నేనే అని లక్ష్మీ ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  

Also Read: అమ్మాయి గారు సీరియల్: రాజు, కీర్తిలకు పెళ్లి చేస్తానని మాటిచ్చేసిన సీఎం.. భర్తపై విరూపాక్షి ఫైర్!