గుండెనిండా గుడిగంటలు జూన్ 12ఎపిసోడ్
పూల దండల ఆర్డర్ తో వచ్చిన డబ్బులతో బాలుకి కారు కొనివ్వాలి అనుకుంటుంది మీనా. ఆ విషయం బాలుకి కూడా చెప్పకుండా కారు కొనిచ్చి సర్ ప్రైజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటుంది. అందుకే బాలు స్నేహితుడు రాజేష్ దగ్గరకు వెళ్లి కారు కొనాలన్న విషయం చెబుతుంది. బాలు ఆటో నడుపుతుంటే నచ్చడం లేదని అందుకే కారు ఇద్దాం అనుకుంటున్నానని చెబుతుంది. కారు కొనడానికి డబ్బులున్నాయా అని రాజేష్ అడిగితే పూల డబ్బుల గురించి చెబుతుంది. అయితే సెకెండ్ హ్యాండ్ లో కారు తీసుకుందాం అని రాజేష్ సలహా ఇస్తాడు. సరే అంటుంది మీనా. గతంలో బాలు ఓ కారు తీసుకుందాం అనుకున్నాడని తనకు తెలిసిన వ్యక్తి దగ్గర ఉందని చెబుతాడు. కన్సల్టెన్సీకి తీసుకెళ్లి బాలు తీసుకుందాం అనుకున్న కారు చూపిస్తాడు రాజేష్. అప్పుడు డబ్బుల్లేవు అన్నారు కదా అని ఓనర్ అంటే..మీనాను చూపించి భర్తకి సర్ ప్రైజ్ ఇద్దాం అనుకుంటోందని చెబుతాడు. కారు 3 లక్షలు ముందుగా 80 వేలు కట్టాలని చెబుతాడు. మీనా సరే అంటుంది. ఆ కారు ఎవరికీ ఇవ్వొద్దని చెప్పి వెళుతుంది.
ఇంటికెళ్లిన తర్వాత బాలు నిద్రపోకుండా కూర్చుంటాడు. బాగా అలసిపోయావా అంటాడు బాలు. ఇంట్లో ఇంతమంది ఆడవాళ్లు ఉన్నా ఒక్కరూ సాయానికి రారు అని బాధపడతాడు. ఆటో తోలి తోలి వీపు నొప్పి పెడుతోంది అంటాడు. పడుకోండి వళ్లు పడతాను అంటుంది. ఇంతలో ప్రభావతి రావడంతో కంగారుగా లేచి కూర్చుంటాడు..మీనా పడుతుంది. ప్రభావతి వచ్చి ఏంటిది హాల్లో అని మండిపడుతుంది. నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. వెంటనే సత్యం వచ్చి మిమ్మల్ని మీ అమ్మ చూడలేకపోతోందట..ఇకపై మీరు రూమ్ లో నిద్రపోండి అంటాడు.
మౌనిక తన భర్త సంజూ మారాలి అని కోరుకుంటూ ఉపవాసం చేస్తుంది. పూజ పూర్తిచేసి తన అత్తయ్యతో ఆ విషయం చెబుతుంది. ఇంతలో సంజూ వచ్చి గొడవ చేయడంతో ఈ రోజు మౌనిక పూజ చేసుకుంటోంది, నీకు ఏం కావాల్సిన నన్ను అడుగు అంటుంది. అలాంటి భార్య దొరకడం నీ అదృష్టం అని అంటే దానికోసం అది చేసుకుంటోంది అంటాడు. నోములు, ఉపవాసాలు ఎంత సేపు చేస్తావో చూస్తా అనుకుంటాడు సంజయ్.
సుమతి కాల్ చేసి ఆ డబ్బుతో ఏం చేద్దాం అనుకుంటున్నావ్ అని అడిగితే ఆయన కోసం కారు కొనాలి అనుకుంటున్నా, రాజేష్ అన్నయ్యతో వెళ్లి చూశాను అంటుంది. కారు అమ్మడానికి శివనే కారణం అందుకే కారు నేనే కొనిద్దాం అనుకుంటున్నా అంటుంది. నా దగ్గర 60 వేలు ఉన్నాయి ఇంకా 20 వేలు అవసరం అవుతాయంటుంది. వడ్డీ వ్యాపారి దగ్గరకు వెళ్లమంటుంది సుమతి. పూలకొట్టు తాకట్టు పెట్టి అప్పు తీసుకోవాలని అనుకుంటుంది మీనా. ఆ వ్యడ్డీ వ్యాపారి వచ్చి పూలకొట్టు చూసి ప్రామిసరీ నోటుపై మీనాతో సంతకం పెట్టించుకుని 20వేలు అప్పుగా ఇస్తాడు. గమనించిన ప్రభావతి ఎందుకు అప్పు చేస్తున్నావని అడుగుతుంది. నాకు బంగారం కొనుక్కోవాలి ఉందని అబద్దం చెబుతుంది మీనా.
రోహిణిని చూసేందుకు మనోజ్ నేరుగా పార్లర్ కి వెళతాడు. అక్కడ ప్రభావతి బ్యూటీ పార్లర్ అని కాకుండా క్వీన్ బ్యూటీ పార్లర్ అనే పేరు ఉండడం చూసి షాక్ అవుతాడు. రోహిణి కంగారుగా బయటకు వస్తుంది
గుండెనిండా గుడిగంటలు జూన్ 13 ఎపిసోడ్ లో దండలు కట్టిన డబ్బంతా పుట్టింటివాళ్లకి ఇచ్చి వచ్చింది. అప్పు కూడా తీసుకుంది అని ప్రభావతి రచ్చ చేస్తుంది. ఆ డబ్బు ఏం చేశానో టైమ్ వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది అంటుంది. మీరేమైనా అడగాలా అని బాలుని అడిగితే..నీ డబ్బు నీ ఇష్టం అంటాడు బాలు. నా భర్తకు లేని అనుమానాలు మీకెందుకు వస్తున్నాయని ఫైర్ అవుతుంది మీనా