Subsidies On Purchases Of Electric Cars And Bikes In India: భారతదేశంలో, ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ వాహనాల గాలి వీస్తోంది. డబ్బులు ఆదా చేసుకోవడం కోసమో లేదా పర్యావరణాన్ని రక్షించే ఉద్దేశంతోనో ప్రజలు ఎలక్ట్రిక్‌ కార్లు, బైకులను కొంటున్నారు. భారతదేశంలో ప్రతి రాష్ట్రం ఎలక్ట్రిక్ వాహన (EV) పాలసీని అమలు చేస్తోంది. ఈ పాలసీ ప్రకారం వివిధ రకాల సబ్సిడీలు, ఇన్సెంటివ్‌లు, రోడ్ టాక్స్ మినహాయింపులు, రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో తగ్గింపులు వంటి ప్రయోజనాలు అందిస్తోంది. ఈ బెనిఫిట్స్‌ రాష్ట్రాన్ని బట్టి మారతాయి. 

ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై రాష్ట్రంవారీగా సబ్సిడీలు (కార్లు, SUVలు)

రాష్ట్రం సబ్సిడీ (ప్రతి kWhకి) గరిష్ట సబ్సిడీ రోడ్ టాక్స్ మినహాయింపు
మహారాష్ట్ర₹5,000   ₹2,50,000   100%
అస్సాం₹10,000   ₹1,50,000100%
గుజరాత్  ₹10,000₹1,50,000 50%  
పశ్చిమ బెంగాల్₹10,000 ₹1,50,000100%
మేఘాలయ ₹4,000    ₹60,000 100%
బీహార్    ₹10,000₹1,50,000   100%
రాజస్థాన్    లేదు  లేదు  NA
ఒడిశాNA  ₹1,00,000 100%     
పంజాబ్లేదు  ₹1,00,000  100%
తెలంగాణలేదులేదు100%
కేరళలేదులేదు50%
ఉత్తర ప్రదేశ్లేదులేదు75% 
కర్ణాటక   లేదులేదు100%
ఆంధ్రప్రదేశ్లేదులేదు100%
తమిళనాడులేదులేదు100%
మధ్యప్రదేశ్ లేదులేదు 99%

 

ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైకుల కొనుగోలుపై రాష్ట్రంవారీగా సబ్సిడీలు

రాష్ట్రం సబ్సిడీ (ప్రతి kWhకి) గరిష్ట సబ్సిడీ రోడ్ టాక్స్ మినహాయింపు
మహారాష్ట్ర₹5,000   ₹25,000100%
గుజరాత్₹10,000   ₹20,00050%  
పశ్చిమ బెంగాల్₹10,000₹20,000100%  
కర్ణాటక లేదులేదు100%
తమిళనాడు లేదులేదు100%
ఉత్తర ప్రదేశ్   లేదులేదు100%
బీహార్₹10,000      ₹20,000100%
పంజాబ్   లేదులేదు 100%
కేరళలేదులేదు50%
తెలంగాణ లేదులేదు100%
ఆంధ్రప్రదేశ్లేదులేదు100%
మధ్యప్రదేశ్  లేదులేదు99%
ఒడిశాNA ₹5,000 100%
రాజస్థాన్₹2,500 ₹10,000  NA
అస్సాం    ₹10,000₹20,000100%
మేఘాలయ₹10,000₹20,000100%

కీలకాంశాలు:

మహారాష్ట్ర: 2025 EV పాలసీ ప్రకారం, ప్రైవేట్ కార్లకు 10% సబ్సిడీ, టోల్ ఫ్రీ ట్రావెల్, రోడ్ టాక్స్ & రిజిస్ట్రేషన్ ఛార్జీలు మినహాయింపు.గుజరాత్: కార్లకు ₹1.50 లక్షల వరకు & బైకులకు ₹20,000 వరకు సబ్సిడీ, రోడ్ టాక్స్ 50% తగ్గింపు.పశ్చిమ బెంగాల్, అస్సాం, బీహార్: కార్లకు ₹1.5 లక్షల వరకు, బైక్‌లకు ₹20,000 వరకు రాయితీ, రోడ్ టాక్స్ మినహాయింపు.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక: కార్లకు, బైక్‌లకు సబ్సిడీలు లేవు. కానీ, రోడ్ టాక్స్ & రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో మినహాయింపు.కేరళ: కార్లకు, బైక్‌లకు సబ్సిడీలు లేవు. కానీ, రోడ్ టాక్స్ 50% తగ్గింపు, ఇ-రిక్షాలకు ₹10,000 నుంచి ₹30,000 వరకు సబ్సిడీ.మధ్యప్రదేశ్: కార్లకు, బైక్‌లకు సబ్సిడీలు లేవు. కానీ, రోడ్ టాక్స్ 99% తగ్గింపు.ఒడిశా: కార్లకు ₹1 లక్ష వరకు, బైక్‌లకు ₹5,000 వరకు రాయితీ + రోడ్ టాక్స్ మినహాయింపు.రాజస్థాన్: కార్లకు సబ్సిడీలు లేవు, బైక్‌లకు ₹10,000 వరకు సబ్సిడీ.