ప్రపంచ శాంతి కోసం 76 ఏళ్ల క్రితం ఐక్యరాజ్యసమితి ప్రారంభమైంది. మరో ప్రపంచ యుద్ధం జరగకుండా అడ్డుకోవడమే దీని ప్రధాన లక్ష్యం. అయితే ప్రపంచంలో జరిగే ఎలాంటి హింసాత్మక ఘటనలపైనైనా చర్యలు తీసుకునే ఐరాస.. అఫ్గానిస్థాన్ విషయంలో మాత్రం సైలెంట్ గా ఉంది. ఇందుకు కారణమేంటి?


యూఎస్, ఫ్రాన్స్, యూకే, రష్యా, చైనా దేశాలకు వీటో పవర్ ఉంది. అయితే తాలిబన్ల విషయంలో ఈ ఐదు దేశాల మధ్య ఏకాభిప్రాయం లేదు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఏ దేశంలోనైనా యుద్ధం ఆపడానికి ఐరాస నేరుగా కలుగజేసుకోదు. పరిస్థితులు మరింత దిగజారినా.. ఐరాస కలుగుజేసుకొని ఓ నిర్ణయం తీసుకోవాలని ఈ దేశాలు కోరితేనే అది సాధ్యమవుతుంది. ప్రపంచదేశాలు శాంతియుతంగా ఉండేలా చూడటమే ఐరాస పని. కానీ బలవంతంగా శాంతిని నెలకొల్పలేదు.






ALSO READ:


Afghanistan Taliban News: అఫ్గాన్‌ ప్రస్తుత పరిస్థితిపై భారత వైఖరేంటి? విదేశాంగ మంత్రి ఎమన్నారంటే..


అయితే అఫ్గానిస్థాన్ లో ఐరాస పాత్ర ఇంత బలహీనపడటానికి కారణం రష్యా, అమెరికా వంటి వీటో దేశాలు ఇందులో కలుగజేసుకోవడమే.


మానవతా సంక్షోభం..


అఫ్గానిస్థాన్ లో మానవతా సంక్షోభం ఏర్పడిందని ఐరాస ఆహార ఏజెన్సీ పేర్కొంది. తాలిబన్లు ఆక్రమించిన తర్వాత ఈ సంక్షోభం మరింత ఎక్కువైందని.. 1.4 కోట్ల మంది ఆకలితో అలమటిస్తున్నారని వెల్లడించింది.


ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం, మూడేళ్లుగా ఉన్న కరవు, కొవిడ్ 19 వల్ల దెబ్బతిన్న ఆర్థిక పరిస్థితుల వల్ల ఇప్పటికే పరిస్థితులు దారుణంగా ఉన్నట్లు ఐరాస పేర్కొంది.


కరవు కారణంగా 40 శాతానికి పైగా పంటలు దెబ్బతినగా, పశుసంపద కూడా నాశనమైంది. తాలిబన్లు దేశాన్ని హస్తగతం చేసుకోవడం వల్ల వేలాదిమంది ప్రజలు వలసలు వెళ్లిపోతున్నరాని దీని వల్ల మరో సంక్షోభం తలెత్తుతుంది. ప్రస్తుతం ప్రజలు ఆహారం అందాలంటే దాతలు 200 మిలియన్ డాలర్ల వరకు విరాళం ఇవ్వాలని యూఎన్ ఫుడ్ ఏజెన్సీ డైరెక్టర్ మేరీ ఎలెన్ మెక్ గ్రాతీ కోరారు.


Afghanistan Funds : బ్యాంకుల్లోని ఆఫ్గాన్ డబ్బులకు వారసులెవరు..?