Afghanistan Explosion: అఫ్గానిస్థాన్‌లో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు.
ఇదీ జరిగింది
మజర్- షరీఫ్ నగరంలో ఈ బాంబు పేలుడు జరిగింది. ఆయిల్ కంపెనీకి చెందిన కార్మికులతో వెళ్తున్న వాహనంపై ఈ దాడి జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు మృతి చెందారు. ఈ మేరకు బాల్క్ ఉత్తర ప్రావిన్స్‌కు చెందిన పోలీస్ అధికారి మహమ్మద్ ఆసిఫ్ వాజెరి తెలిపారు.
ఈ రోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో హైరటన్ ఆయిల్ కంపెనీకి చెందిన బస్సు బాంబు పేలుడుకు గురైంది. ఈ ఘటనలో ఐదు మంది కార్మికులు మరణించారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. - పోలీస్ అధికారి
Also Read: Bharat Jodo Yatra: BJP కార్యకర్తలకు రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్‌లు!