సమంత (Samantha) స్టార్‌డమ్‌కు 'యశోద' ఉదాహరణ. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. థియేటర్లలో చాలా మంది ప్రేక్షకులు సినిమా చూశారు. థియేటర్లలో చూడని వాళ్ళకు గుడ్ న్యూస్. త్వరలో ఈ సినిమా ఓటీటీలో సందడి చేయనుంది. మరికొన్ని గంటల్లో డిజిటల్ స్క్రీన్ మీద సినిమా చూడొచ్చు. 


శుక్రవారం నుంచి ప్రైమ్ వీడియోలో!
'యశోద' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ సొంతం చేసుకుంది. డిసెంబర్ 9 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా స్ట్రీమింగ్ కానుందని పేరొంది. నిజం చెప్పాలంటే... డిసెంబర్ 8 రాత్రి, అనగా గురువారం అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. 






'యశోద'పై కేసు కొట్టేసిన కోర్టు!
ఆ మధ్య 'యశోద' సినిమా (Yashoda Movie) ను ఓటీటీలో విడుదల చేయకూడదని హైదరాబాద్‌లోని ఓ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. హైదరాబాద్, వరంగల్‌లో 'ఈవా ఐవీఎఫ్' పేరుతో హాస్పిటల్స్ ఉన్నాయి. 'యశోద'లో 'ఈవా' పేరు ఉపయోగించడం వల్ల తమ హాస్పిటల్స్ బ్రాండ్ ఇమేజ్‌కు డ్యామేజ్ అవుతోందని ఆస్పత్రి వర్గాలు కోర్టులో కేసు వేశాయి. ఆ విషయం తెలిసిన వెంటనే వాళ్ళతో 'యశోద' చిత్ర నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ (Sivalenka Krishna Prasad) చర్చలు జరిపారు. ఆ సమస్యను సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కారించారు. 


'యశోద'లో 'ఈవా' పేరును తొలగించినట్టు శివలెంక కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. ఆ నిర్ణయంతో 'ఈవా ఐవీఎఫ్' ఆస్పత్రి ఎండీ మోహన్ రావు సంతోషం వ్యక్తం చేశారు. ఆ విషయం కోర్టుకు విన్నవించుకోవడంతో కేసు కొట్టేశారు.


Also Read : బాలీవుడ్ స్టార్స్‌కు 'నో' చెప్పేసి మరీ పవన్‌తో సుజిత్‌ సినిమా - ఎగ్జైట్ అవుతున్న అకిరా


'యశోద' విడుదలకు ముందు సమంత ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాలేదు. ఒక్కో రోజు అడుగు తీసి, అడుగు వేయడం కష్టమైందని ఆమె పేర్కొన్నారు. సెలైన్ బాటిల్ సహాయంతో డబ్బింగ్ చెప్పారు. ఆమె కష్టానికి తగిన ప్రతిఫలం లభించింది. సినిమా విజయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ తమన్నా థాంక్స్ నోట్ కూడా విడుదల చేశారు. ''మీరు (ప్రేక్షకులు) చూపిస్తున్న ప్రేమ, ఆదరణకు నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. మీకు నా ధన్యవాదాలు. మీ ప్రశంసలు, మీరు ఇస్తున్న మద్దతు చూస్తున్నాను. ఇదే నాకు  లభించిన గొప్ప బహుమతి'' అని సమంత చెప్పారు.
 
'యశోద' సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి కారణమైన దర్శక - నిర్మాతలకు, సహ నటీనటులకు కూడా సమంత థాంక్స్ చెప్పారు. ''నా పైన, ఈ కథపైన నమ్మకం ఉంచిన నిర్మాత, శ్రీదేవి మూవీస్‌ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ గారికి కృతజ్ఞతలు. దర్శకులు హరి, హరీష్‌తో పని చేయడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఈ కథ కోసం ఎంతో రీసెర్చ్ చేశారు. వాళ్ళకు థాంక్స్.  వరలక్ష్మీ శరత్ కుమార్ గారికి, ఉన్ని ముకుందన్ గారికి, మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరితో పనిచేయడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది'' అని సమంత తెలిపారు.



'యశోద' సీక్వెల్ ఐడియా రెడీ!
'యశోద' సక్సెస్ మీట్‌ (Yashoda Success Meet)లో సీక్వెల్ ఐడియా రెడీగా ఉన్నట్లు దర్శకులు హరి, హరీష్ వెల్లడించారు. ''యశోద 2'కు విషయంలో మాకు ఓ ఐడియా ఉంది. సెకండ్ పార్ట్ మాత్రమే కాదు... థర్డ్ పార్ట్‌కు లీడ్ కూడా రెడీగా ఉంది'' అని హరి, హరీష్ తెలిపారు. అయితే... సీక్వెల్స్ సెట్స్ మీదకు ఎప్పుడు వెళ్ళేది సమంత చేతుల్లో ఉందని, ఆమె నిర్ణయంపై ఆధారపడి ఉందని చెప్పారు. ఇప్పుడు సమంత ఆరోగ్య పరిస్థితి అందరికీ తెలిసిందే. ఆవిడ ఆరోగ్యంగా తిరిగి వచ్చిన తర్వాత స్టోరీ నేరేట్ చేస్తామన్నారు. సీక్వెల్ తీయడానికి నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ కూడా రెడీగా ఉన్నారు. 'యశోద'లో సమంత ట్రైనీ పోలీస్ / అండర్ కవర్ కాప్ తరహా రోల్ చేశారు. 'యశోద 2'లో ఆవిడ పోలీస్ అధికారిగా కనిపించే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. రెండో పోర్టులో కూడా వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ ఉంటారట.