అఫ్గానిస్థాన్‌ లో తాలిబన్ల రక్తపాతాన్ని నివారించడానికే తాను దేశం విడిచి వెళ్లినట్లు ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ తెలిపారు. తానిబన్లను ఇంకా ప్రతిఘటిస్తే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. తాలిబన్ల విజయాన్ని పరోక్షంగా అంగీకరించిన అష్రఫ్ ఘనీ... ఇకపై దేశ రక్షణ తాలిబన్ల బాధ్యతేనని స్పష్టం చేశారు. ఆయన తన ఫేస్‌బుక్‌ ఖాతాలో ఓ సందేశాన్ని విడుదల చేశారు. అఫ్గానిస్థాన్ ఆదివారం నాడు తాలిబన్ల వశమైంది. దీంతో ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి వెళ్లపోవడం తెలిసిందే


Also Read: Afghanistan President Resigns: అఫ్గాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ రాజీనామా.. కొత్త అధిపతిగా అలీ అహ్మద్ జలాలీ?!


రక్త పాతాన్ని నివారించేందుకే దేశాన్ని వీడాను : అష్రఫ్ ఘనీ




అష్రఫ్ ఘనీ తన ఫేస్ బుక్ ఖాతాలో ఈ సందేశం రాశారు. "దేశ ప్రజలారా...ఇవాళ నేను ఓ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. గత రెండు దశాబ్దాలుగా నా దేశాన్ని కాపాడుకుంటూ వచ్చాను. ప్రస్తుత పరిస్థితుల్లో దేశాన్ని వీడడమా... లేక అధ్యక్ష భవనంలోకి రావాలనుకుంటున్న తాలిబన్లను ఎదుర్కోవడమా అనే రెండు ప్రశ్నలు తలెత్తాయి. ఇప్పటికే ఎంత మంది ఈ పోరాటంలో అమరులయ్యారు. కాబుల్‌ నగరం విధ్వంసాన్ని చవిచూసింది. ఈ పరిణామాలతో నా మనసు విరిగిపోయింది. తాలిబన్లు నన్ను తొలగించాలని నిర్ణయించుకున్నారు. ఈ ఘోర రక్తపాతాన్ని నివారించేందుకు నేను దేశం వీడుతున్నాను" అని ఘనీ ఫేస్‌బుక్‌ లో రాసుకున్నారు. 


Also Read: Afghanistan News: తాలిబన్ల చేతిలో అఫ్గానిస్థాన్.. అధికార మార్పిడి కోసం చర్చలు


తజకిస్థాన్ లో అష్రఫ్ ఘనీ!


ఆదివారం అఫ్గానిస్థాన్  రాజధాని కాబుల్ శివార్లలోకి చేరుకున్న తాలిబన్లు.. నగరాన్ని అన్ని వైపులా చుట్టుముట్టారు. కానీ కాబుల్ పై దాడులకు పాల్పడలేదు. తాలిబన్లు సహజంగా సాయుధదాడి చేస్తారు. విధ్యంసం సృష్టిస్తారు. అయితే తమ సహజ స్వభావానికి విరుద్ధంగా తాలిబన్లు శాంతియుతంగా అధికార మార్పిడి కావాలని భావించారు. షరతులు ఏమీ పెట్టకుండానే అధికారాన్ని తమకు హస్తగతం చేయాలని డిమాండ్‌ చేశారు. అందుకోసం చర్చలు జరిపేందుకు తమ రాయబారులను అధ్యక్షుడి భవనానికి పంపించారు. అఫ్గాన్ ప్రభుత్వం తరఫున ఆ దేశ మాజీ అధ్యక్షుడు హమీద్‌ కర్జాయ్‌, జాతీయ రాజీ మండలి అధినేత అబ్దుల్లా చర్చల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత అధ్యక్ష భవనంలోకి తాలిబన్లు ప్రవేశించారు. దీంతో అఫ్గాన్‌ పూర్తిగా తాలిబన్ల వశం అయ్యింది. ఆ వెంటనే దేశ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ దేశం విడిచి పారిపోయారు. అష్రఫ్ ఘనీ తన సన్నిహితులతో కలిసి తజకిస్థాన్‌ వెళ్లారని తెలుస్తోంది.


Also Read: Afghanistan Taliban Crisis: అఫ్గానిస్థాన్ ను అంత ఈజీగా తాలిబన్లు ఎలా చేతిలోకి తెచ్చుకున్నారు? అసలు తాలిబన్ అంటే ఏంటి?


బైడెన్ రాజీనామా చేయాలి: ట్రంప్


అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​పై ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శలు చేశారు. జో బైడెన్ ప్రభుత్వ వైఫల్యం వల్లే అఫ్గానిస్థాన్​తాలిబన్ల పరమైందని ఆరోపించారు. దీంతో పాటు కరోనా నియంత్రణలో కూడా బైడెన్ పూర్తిగా విఫలమయ్యారని తీవ్ర విమర్శలు చేశారు. వీటికి బాధ్యత వహిస్తూ బైడెన్ వెంటనే రాజీనామా చేయాలని ట్రంప్ డిమాండ్ చేశారు.  అఫ్గాన్ సంక్షోభంపై జో బైడెన్ ఎలా స్పందిస్తారో అని వైట్ హౌస్ లో చర్చించుకుంటున్నారు. అఫ్గాన్ ప్రజలకు బైడెన్ నమ్మకద్రోహం చేశారని, నిరసనకారులు శ్వేతసౌధం వద్ద ఆదివారం ఆందోళన చేశారు.


Also Read: UN Chief On Afghanistan: ఎంత బలప్రయోగం చేసినా తగ్గేదెలె.. అఫ్గాన్‌లో పరిస్థితులపై ఆ దేశాధ్యక్షుడి కీలక ప్రకటన..


అమెరికా బలగాలు మోహరింపు


అఫ్గానిస్థాన్ నుంచి అమెరికన్లను సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు కాబుల్ ​విమానాశ్రయంలో 6 వేల మంది బలగాలను మోహరించనున్నట్లు అమెరికా తెలిపింది. తమ మిత్రదేశాల ప్రజలను కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా తరలిస్తామని అమెరిక తెలిపింది. ఈ విషయంపై అమెరికా విదేశాంగ మంత్రి వివిధ దేశాల ప్రతినిధులతో ఫోన్లో మాట్లాడారు. అఫ్గాన్​లో ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు తాలిబన్లే బాధ్యత వహించాలని అమెరికా, ఐరోపా సమాఖ్య సహా 60కి పైగా దేశాలు సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి. 


Also Read: Talibans: ఆఫ్ఘనిస్థాన్‌ పరిస్థితులు ఇంకా దిగజారతాయంటున్న అమెరికా.. ఆ దేశానికి మూడువేల మంది యూఎస్‌ బలగాలు..