అఫ్గానిస్థాన్ లో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు భారత్ తెలిపింది. శాంతి, సామరస్యాలు కలిసిన ప్రజాస్వామ్య అఫ్గాన్‌ను భారత్ కోరుకుంటున్నట్లు విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చి పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ప్రజల తరలింపుకు సంబంధించి భద్రతాపరమైన అంశాలు ఎలా కొలిక్కి వస్తాయో చూడాలన్నారు. ప్రస్తుతం తమ లక్ష్యమంతా సురక్షితంగా ప్రజలను తరలించడేమనని స్పష్టం చేశారు.
తాలిబన్ ప్రభుత్వాన్ని భారత్ గుర్తిస్తుందా అన్న ప్రశ్నకు.. ప్రభుత్వ ఏర్పాటుకు అఫ్గాన్‌లో పరిస్థితులు అనుకున్న విధంగా లేవని బాగ్చి సమాధానమిచ్చారు. ప్రజల భద్రత పైనే తాము ప్రధానంగా దృష్టి సారిస్తున్నామన్నారు. భారత్‌కు వచ్చే అఫ్గాన్ పౌరులకు కేంద్ర హోంశాఖ ఈ-ఎమర్జెన్సీ వీసాను ప్రకటించిందని తెలిపారు. వీటి కాల వ్యవధి ఆరునెలలు ఉంటుందన్నారు.
Also Read: Rajasthan CM Health: ఆసుపత్రిలో చేరిన రాజస్థాన్ సీఎం.. త్వరగా కోలుకోవాలని మోదీ ట్వీట్