Afghanistan Blast:


గవర్నర్ మహమ్మద్ దావూద్ మృతి


తాలిబన్‌లోని బల్క్ ప్రావిన్స్ గవర్నర్ మహమ్మద్ దావూద్ ముజమ్మిల్ బాంబ్ బ్లాస్ట్‌లో ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో ఆయన మృతి చెందినట్టు బల్క్  ప్రావిన్స్ పోలీసులు వెల్లడించారు. ఆఫీస్‌లో ఉండగానే ఈ పేలుడు సంభవించినట్టు తెలిపారు. అయితే...ఈ పేలుడుకి కారణమేంటన్నది ఇంకా తెలియరాలేదు. 2021 ఆగస్టులో తాలిబన్లు అఫ్గనిస్థాన్‌ను హస్తగతం చేసుకున్నారు. అప్పటి నుంచి తాలిబన్లలో కీలకంగా వ్యవహరిస్తున్నారు మహమ్మద్ దావూద్ ముజిమ్మల్. ఇస్లామిక్ స్టేట్ జిహాదీలపై పోరాడం చేయడంలోనూ కీలక పాత్ర పోషించారు. గతేడాది బల్క్ ప్రావిన్స్‌కు గవర్నర్‌గా నియమించింది ప్రభుత్వం. ఇప్పటి వరకూ ఏ ఉగ్ర సంస్థ కూడా ఈ దాడి తామే చేసినట్టు ప్రకటించలేదు. ఇటీవలి కాలంలో అఫ్గనిస్థాన్‌లో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. ఇస్లామిక్ స్టేట్ (IS) ఉగ్రసంస్థ ఈ దాడులకు పాల్పడింది. జనవరిలో కాబూల్‌లోని విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయానికి సమీపంలో ఆత్మాహుతి దాడి చేసింది. ఈ దాడిలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. తాలిబన్ భద్రతా బలగాలు ఈ ఉగ్రసంస్థను అణిచి వేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చినట్టు వెల్లడించాయి తాలిబన్ సెక్యూరిటీ ఫోర్సెస్. 


కాబూల్‌లో పేలుడు...


అఫ్ఘనిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో ఈ మధ్య కాలంలో బాంబు పేలుళ్ల ఘటనలు కలకలం రేపుతున్నాయి. వరుసగా ఏదో ఓ చోట ఇవి జరుగుతూనే ఉన్నాయి. గతేడాది సెప్టెంబర్‌లో భారీ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. కాబూల్‌లోని ఓ ఎడ్యుకేషనల్ సెంటర్‌లో ఆత్మాహుతి దాడి జరగ్గా...100 మంది చిన్నారులు మృతి చెందినట్టు తెలుస్తోంది. స్థానిక జర్నలిస్ట్‌లు ఇస్తున్న సమాచారం ప్రకారం...హజారా, షియా వర్గాలకు చెందిన విద్యార్థులను టార్గెట్‌ చేసుకుని ఈ బ్లాస్ట్‌కు పాల్పడ్డారని తెలుస్తోంది. అఫ్ఘనిస్థాన్‌లో హజారాలు మూడో అతి పెద్ద వర్గంగా ఉన్నారు. దస్త్ ఏ బర్చి ప్రాంతంలోని కాజ్‌ ఎడ్యుకేషన్ సెంటర్‌లో ఈ పేలుడు సంభవించినట్టు అక్కడి మీడియా కథనాలు వెల్లడించాయి. "ఇప్పటి వరకూ 100 మంది చిన్నారుల మృత దేహాలు బయటపడ్డాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. తరగతి గదిలో చాలా మంది విద్యార్థులున్నారు. మాక్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాస్తున్న సమయంలో ఈ పేలుడు సంభవించింది" అని లోకల్ జర్నలిస్ట్ ఒకరు ట్విటర్‌లో వెల్లడించారు. విద్యార్థుల శరీర భాగాలు చెల్లాచెదురయ్యాయి. ఈ దాడులను అమెరికా తీవ్రంగా ఖండించింది. అఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్‌లో గతంలోనూ భారీ పేలుడు సంభవించింది. రష్యా ఎంబసీ పరిసరాల్లో దరుల్ అమన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 20 మృతి చెందారు. అఫ్గానిస్థాన్‌లోని టోలో న్యూస్‌ ఈ ప్రాథమిక వివరాలు వెల్లడించింది. ఇటీవలే హెరట్ ప్రావినెన్స్‌లోనూ ఇదే తరహాలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. మసీదులో పేలుడు సంభవించగా...18 మంది మృతి చెందారు. 21 మంది గాయపడ్డారు. ఆ మసీదు ఇమామ్ మావల్వి ముజీబ్ రహమాన్ అన్సారీ ఈ పేలుడులో మృతి చెందినట్టు టోలో న్యూస్ వెల్లడించింది. మసీదులో ప్రార్థనలు చేసుకునే సమయంలో ఆత్మాహుతి దాడి జరిగినట్టు స్పష్టం చేసింది. 


Also Read: Power Cut In Summer: ఏప్రిల్‌లో కరెంట్ కోతలు తప్పవా! రాత్రి పూట నరకం చూడాల్సిందేనా?