Tata Motors Nexon Latest Price After Gst 2.0 News:  జీఎస్టీ స్లాబుల స‌వ‌ర‌ణ లాభాన్ని క‌స్ట‌మ‌ర్ల‌కు పంచేందుకు కంపెనీలు న‌డుం బిగించాయి. రాబోయే స్లాబ్ ప్ర‌కారం మోడ‌ళ్ల ధ‌ర‌ను మార్చి, ఆ మేర‌కు క‌స్ట‌మ‌ర్ల‌కు అందించేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్నాయి.  భారతదేశంలో ప్రజలకు జీఎస్టీ తగ్గింపుతో ప్రయోజనం 2025 సెప్టెంబర్ 22 నుండి లభించనుంది. దీనితో పాటు టాటా మోటార్స్ తమ ప్యాసింజర్ కార్లు , SUVల ధరలను రూ.65 వేల నుంచి రూ.1.55 లక్షల వరకు తగ్గించనున్నట్లు ప్రకటించింది.

ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ ప్యాసింజర్ వాహనాలపై పన్నుల నిర్మాణాన్ని మార్చింది. ఇకపై చిన్న వాహనాలపై (LPG, CNG - 1200cc వరకు మరియు పొడవు 4000mm వరకు / డీజిల్ - 1500cc వరకు , పొడవు 4000mm వరకు) కేవలం 18% జీఎస్టీ మాత్రమే వసూలు చేయబడుతుంది. పెద్ద వాహనాలపై జీఎస్టీ ఇప్పటి వరకు 45% నుండి 50% ఉండగా, ఇప్పుడు 40%కి తగ్గించబడింది. ఈ మార్పుల వల్ల కస్టమర్లకు కార్ల ధరల్లో తగ్గింపుగా ప్రయోజనం లభించనుంది. ఈక్ర‌మంలో ఈ సీజ‌న్ లో కార్ల అమ్మ‌కాలు భారీ స్థాయిలో ఉంటాయని మార్కెట్ వ‌ర్గాలు భావిస్తున్నాయి. 

లాభం ఎంతంటే..?జీఎస్టీ స్లాబ్ స‌వ‌ర‌ణ ద్వారా చిన్న కార్ల‌పై చాలా మేర‌కు క‌స్ట‌మ‌ర్ల‌కు లాభం చేకూరుతుంది. ఇక టాటా మోటార్స్ లోని నెక్సాన్ కారును ధ‌ర‌ను ప‌రిశీలించినట్ల‌యితే వేల నుంచి ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కుఆదా అవుతుంది. టాటా నెక్సాన్ కొనుగోలు చేసే వారు ఎంత లాభపడతారంటే, దీని ఎక్స్-షోరూం ధర రూ.8 లక్షల నుంచి రూ.15.60 లక్షల వరకు ఉంది. అందువల్ల టాప్ వేరియంట్‌పై రూ.1.55 లక్షల వరకు ధర తగ్గింపు లభిస్తుంది, అంటే దాదాపు 10% జీఎస్టీ తగ్గింపుతో ప్రయోజనం లభిస్తుంది. టాటా నెక్సాన్‌ లో కంపెనీ 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను అందించగా, ఇది 120 BHP గరిష్ట శక్తిని , 170 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, 1.5 లీటర్ డీజిల్ వేరియంట్ 110 BHP గరిష్ట శక్తితో పాటు 260 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 

సూప‌ర్బ్ ఫీచ‌ర్లు..టాటా నెక్సాన్‌లో అనేక ఉత్తమ ఫీచర్లు ఉన్నాయి. ఈ సెగ్మెంట్ లో అత్యుత్త‌మ సెక్యూరిటీతోపాటు ఫీచ‌ర్లు కూడా ఈ మోడ‌ల్ ను విభిన్నంగా చూపిస్తున్నాయి. ఇక ఫీచ‌ర్ల విష‌యానికొస్తే 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, హైట్ అడ్జస్టబుల్ సీట్లు, వైర్‌లెస్ చార్జింగ్, ఫాస్ట్ USB ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లతో ఈ కారు క‌స్ట‌మ‌ర్ల‌కు హాట్ చాయిస్ గా మారింద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఏదేమైనా జీఎస్టీ స‌వ‌ర‌ణ‌తో త‌మ క‌ల‌ల కారును కొనుగోలు చేసేందుకు ఇప్ప‌టికే వినియోగ‌దారులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.