Advocate Rakesh Kishore attacked with slippers in Delhi court:  సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి  బీఆర్ గవాయ్‌పై  షూ  విసిరిన  అడ్వకేట్ రాకేష కిషోర్ పై చెప్పులతో దాడి జరిగింది. ఈ ఘటనకు సంబంధించి బర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వేసిన సస్పెన్షన్‌కు సంబంధించి  కోర్టులో హాజరైన  అనంతరం తెలిసిన కొందరు  ఇలా చెప్పుతో దాడి చేశారు.  ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ రాజకీయ, చట్టపరమైన వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

Continues below advertisement

71 సంవత్సరాల వయస్సు కలిగిన అడ్వకేట్ రాకేష్ కిషోర్, అక్టోబర్ 6న సుప్రీంకోర్టు కోర్టు నంబర్ 1లో మెన్షనింగ్  సమయంలో మాజీ సిజేఐ బీఆర్ గవైపై చెప్పు విసరడం సంచలనం సృష్టించింది.చెప్పు దూరంగా పడింది.  ఈ ఘటనకు సంబంధించి కిషోర్‌ను కొంతసేపు అరెస్టు చేసినప్పటికీ,  కేసు పెట్టాల్సిన అవసరం లేదని సీజేఐ  రిజిస్ట్రార్ జనరల్‌కు సూచించడంతో అదే రోజు విడుదల చేశారు. అయితే, బీసీఐ కొర్టు గౌరవానికి విరుద్ధంగా ప్రవర్తించినందుకు కిషోర్‌పై సస్పెన్షన్ వేసింది.    

Continues below advertisement

 డిసెంబర్ 9న కార్కర్దూమా కోర్టులో సస్పెన్షన్‌కు సంబంధించి హాజరైన కిషోర్‌పై ఎవరో తెలియని వ్యక్తులు చెప్పులతో దాడి చేశారు.  వారిలో 35-40 సంవత్సరాల వయస్సు గల ఒక యువ న్యాయవాది కూ ఉన్నారు.   

ఈ ఘటనపై లాయర్ కిషోర్ భిన్నంగా స్పందించారు. ఇది తమ అంతర్గత విషయమన ిచెప్పుకున్నారు.