Rayagada Guntur Express | రైలు నెంబర్ 17243  గుంటూరు-రాయగడ ఎక్స్ ప్రెస్ టైమింగ్స్ మార్చాలాంటూ ఉత్తరాంధ్ర ప్రయాణికులు, వలస కూలీలు డిమాండ్ చేస్తున్నారు. అక్కడి నుండి ప్రతీ రోజూ ఉపాధి కోసం ఇతర పనుల కోసం విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు పెద్ద ఎత్తున వస్తుంటారు. అలాగే రాజధాని అమరావతి పనులు జరుగుతున్న నేపథ్యంలో ఏదైనా పని దొరకక పోతుందా అని ఆశ తో వచ్చే జనాలు కూడా చాలా మందే. అయితే ఈ రైలు గుంటూరు నుండి రాయగడ కు బయలు దేరే సమయాలు మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉన్నాయంటున్నారు ప్రయాణికులు.

Continues below advertisement

అర్ధరాత్రి ప్రయాణం- చాలా ఇబ్బంది కరం

 17243 నెంబర్ తో ప్రయాణించే గుంటూరు-రాయగడ ఎక్స్ ప్రెస్ ప్రతీ రాత్రి 11:20కి గుంటూరు లో బయలు దేరుతుంది. విజయవాడ వచ్చేసరికి అర్ద రాత్రి 12:05 ఉదయం 9గంటలకు వైజాగ్ మధ్యాహ్నం 1:40 కి రాయగడ చేరుకుంటుంది. అయితే పొట్ట కూటి కోసం ఉత్తరాంధ్ర నుండి రాజధాని, విజయవాడ గుంటూరు ప్రాంతాలకు వచ్చే దిగువ మధ్య తరగతి ప్రజలకు తిరిగి తమ ప్రాంతాలకు వెళ్లాలంటే ఈ ట్రైన్ చాలా ముఖ్యం. పైగా జనరల్ బో్గీలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ ట్రైన్ లో కాస్త తక్కువ ధరతో సొంత ఊళ్ళకి వెళ్ళిపోవచ్చు అని ఆశపడతారు ప్రయాణికులు.కానీ మరీ అర్ధరాత్రి పూట గుంటూరు, విజయవాడ నుండి బయలుదేరడం వల్ల పిల్లా పాపలతో సామానుతో ఈ ట్రైన్ లో ఆ సమయంలో ప్రయాణం చాలా కష్టం గా ఉంటుంది అని ఉత్తరాంధ్ర కు చెందిన ప్రదీప్ అన్నారు. 

Continues below advertisement

ఒకప్పుడు రాత్రి 9గంటలకు విజయవాడ నుండి బయలుదేరే ట్రైన్ ఇది

ఈ ట్రైన్ నిజానికి ఒక ప్యాసింజర్ ట్రైన్. విజయనగరం -విజయవాడ మధ్య తిరిగేది. అర్ధరాత్రి పూట ప్రయాణించే ట్రైన్ కాబట్టి దీన్ని అప్పట్లో దొంగలబండి/దెయ్యాల బండి అని సరదాగా పిలిచేవారు. అయితే స్టార్టింగ్ పాయింట్స్ లో అంటే విజయవాడ, విజయనగరం లో మాత్రం రాత్రి 8 గంటలకే ప్రారంభం అయ్యేది. 1999-2000 రైల్వే బడ్జెట్ లో ప్రయాణికుల డిమాండ్ మేరకు దీన్ని రాయగడ వరకూ పొడిగించారు. అప్పడు రాత్రి 9గంటలకు విజయవాడ లో బయలుదేరేది. 1 ఏప్రిల్ 2018 న  ఈ ట్రైన్ ను ఎక్స్ ప్రెస్ గా మార్చారు.అదే ఏడాది 1 నవంబర్ నుండి  గుంటూరు వరకూ పొడిగించారు. 

గుంటూరు, విజయవాడ నుండి బయలుదేరే ప్రయాణికులు  టైమింగ్స్ మాత్రం చాలా ఇబ్బంది కరంగా నిర్ణయించారు అంటున్నారు . మిగిలిన ఎక్స్ ప్రెస్ రైళ్ళ లో సాధారణంగా రెండు మూడు జనరల్ బో్గీలు ఉంటే ఈ ట్రైన్ లో ఏకంగా 9 జనరల్ బో్గీలు ఉంటాయి. అందువల్ల ఈ ట్రైన్లో వెళ్ళడానికి ప్రిఫెరెన్స్ ఇస్తుంటారు వలస కూలీలు. అందుకే మునుపటి లా రాత్రి 9 గంటల ప్రాంతం లో విజయవాడ నుండి బయలుదేరేలా ఈ ట్రైన్ టైమింగ్స్ మార్చమని రైల్వే డిపార్ట్మెంట్ ను కోరుతున్నారు పాసింజర్స్.