Rynox Apex Evo Riding Jacket: ఇండియన్‌ బైకర్లలో రైనాక్స్‌ బ్రాండ్‌ అంటే మంచి నమ్మకం. ఇప్పుడు అదే కంపెనీ తీసుకొచ్చిన Rynox Apex Evo జాకెట్‌ స్పోర్టీ రైడర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన అత్యంత ఫోకస్డ్‌ గేర్‌. మొదటి చూపులోనే ఈ జాకెట్‌ ప్రీమియం ఫీలింగ్‌ ఇస్తుంది. Invista Cordura ఫ్యాబ్రిక్‌, స్ట్రెచ్‌ ప్యానెల్స్‌, ఎల్లో & షోల్డర్‌ స్లైడర్లు, ఛెస్ట్‌ మీద రైనాక్స్‌ బ్రాండింగ్‌ - ఇవన్నీ చూస్తేనే ఇది ఒక హై-ఎండ్ స్పోర్ట్స్‌ రైడింగ్‌ జాకెట్‌ అని అర్థమవుతుంది.

Continues below advertisement

రైడర్‌ బాడీకి సరిపోయేలా డిజైనింగ్‌జాకెట్‌ను వేసుకున్న వెంటనే అత్యంత పటిష్టమైన, పర్ఫెక్ట్‌ ఫిట్‌ అనిపిస్తుంది. చేతుల మీద వెల్క్రో అడ్జస్ట్‌మెంట్లను తీసేయడంతో, ఈ జాకెట్‌ రైడర్‌ బాడీకి సరిగ్గా అమరినట్లు సరిపోతుంది. టక్‌ అయ్యే పొజిషన్‌లోకి వంగినప్పుడు ముందుభాగంలో జాకెట్‌ బల్జ్‌ అవ్వకపోవడం రైడర్లకు పెద్ద ప్లస్‌ పాయింట్‌. వెయిస్ట్‌ వద్ద మాత్రమే సర్దుబాటు స్ట్రాప్‌ ఉంటుంది, కానీ చాలా మందికి అది అవసరం కూడా ఉండదు.

లెవల్‌ 2 ఆర్మర్‌ఈ జాకెట్‌ CE Class AA సర్టిఫికేషన్‌తో పాటు పూర్తి లెవల్‌ 2 ఆర్మర్‌ అందిస్తుంది, ఇది ఇండియన్ మార్కెట్‌లో చాలా అరుదు. భుజాలు, మోచేతులు, వీపు భాగం, ఛాతీ భాగం.. ఇలా అన్ని ప్రాంతాల్లో ప్రొటెక్షన్‌ ఉండడం ఈ జాకెట్‌ ప్రధాన హైలైట్‌. షోల్డర్‌-ఎల్బో ప్రొటెక్షన్లు RHEON టెక్నాలజీతో ఉండగా, ఛెస్ట్‌ ప్రొటెక్టర్లు CERROS తో వచ్చాయి. స్లిమ్ బాడీ ఉన్న రైడర్లకు ఈ జాకెట్‌ అత్యంత గట్టిగా, కంఫర్ట్‌గా ఉంటుంది. అయితే మస్క్యులర్‌ బాడీ (కండలు తిరిగిన శరీరం) ఉన్నవారికి ఎల్బో ప్రాంతం కొంత కఠినంగా అనిపించొచ్చు.

Continues below advertisement

అన్ని రకాల రైడ్స్‌కూ సూటబుల్‌రైనాక్స్‌ ఏపెక్స్‌ ఈవో జాకెట్‌ను స్పోర్టీ రైడింగ్‌ కోసమే డిజైన్‌ చేసినప్పటికీ, ఎక్స్‌పర్ట్‌లు దీనిని వివిధ బైకులపై ఉపయోగించి పరీక్షించారు. లాంగ్‌ రైడ్స్‌, సిటీ రైడ్స్‌ సహా అన్ని సందర్భాల్లో ఇది చాలా కంఫర్ట్‌గా అనిపించిందని వెల్లడించారు. ముఖ్యంగా, మెడ ప్రాంతంలో సాఫ్ట్ మెటీరియల్‌ ఉండడం వల్ల స్కిన్‌ను ఇబ్బంది పెట్టదు.

జాకెట్‌ను వాష్‌ చేసి తిరిగి ధరించిన తర్వాత, ఎల్బో ఆర్మర్‌ను మళ్లీ పెట్టడం కొంచెం కష్టంగా ఉంటుంది, ముఖ్యంగా S సైజ్‌ను వాడే వారికి ఇది మరింత కఠినంగా ఉండవచ్చు.

సేఫ్టీ ఎల్బో-షోల్డర్‌ స్లైడర్లు కొంచెం స్పోర్ట్స్‌ బైక్‌ ట్రాక్‌ ఫీల్‌ ఇస్తాయి. కానీ ఇవి లుక్స్‌ కోసం మాత్రమే కాదు. యాక్సిడెంట్‌ సమయంలో ఇది రోడ్డును రాసుకుంటూ జారిపోయేలా ఉండి, రైడర్‌ బాడీ మీద ఇంపాక్ట్‌ తగ్గించేలా డిజైన్‌ చేశారు. ఇవి వెల్క్రోతో అతికించారు కాబట్టి రైడర్‌ ఇష్టానికి అనుగుణంగా తీసేయవచ్చు కూడా.

పాకెట్లుపాకెట్ల విషయానికి వస్తే - రెండు బయటి పాకెట్లు, ఒక ఇంటర్నల్‌ పాకెట్‌ ఉంటుంది. పెద్ద స్మార్ట్‌ ఫోన్లు కూడా ఈ పాకెట్లలో సులభంగా సెట్ అవుతాయి.

ధరమొత్తంగా చూస్తే, రైనాక్స్‌ ఏపెక్స్‌ ఈవో జాకెట్‌, స్లిమ్‌గా ఉండే రైడర్లకు చక్కగా సరిపోయేలా తయారు చేశారు. ధర 15,750 రూపాయలు. ఒక ఇండియన్‌ జాకెట్‌కు ఇది కొంచెం ఎక్కువ రేటు అనిపించినా, దీనిలో వాడిన ప్రీమియం మెటీరియల్‌, లెవల్‌ 2 ఆర్మర్‌, స్ట్రాంగ్‌ కన్‌స్ట్రక్షన్‌ దృష్ట్యా ఈ ధర న్యాయమే అనిపిస్తుంది.

సేఫ్టీ, స్పోర్టీనెస్‌ & డైలీ యూజ్‌ - ఈ మూడు ఒకేసారి కావాలనుకునే రైడర్లకు Rynox Apex Evo ఒక బెస్ట్‌ పిక్‌.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.