హిందీ సినిమా ప్రేక్షకులలో మాత్రమే కాదు... జాతీయ - అంతర్జాతీయ రాజకీయాల్లో కూడా 'ధురంధర్' చర్చకు దారి తీసింది. పాకిస్తాన్ దేశం నుంచి తీవ్రవాదులు మన దేశంలోకి ఎలా చొరబడుతున్నారు? ఇండియాలో టెర్రర్టిస్ట్ ఎటాక్స్ వంటివి ఆదిత్య ధర్ చూపించారు. బాక్సాఫీస్ బరిలో సినిమా మంచి వసూళ్ళు రాబడుతోంది. పైగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. 'ధురంధర్' చివరిలో సీక్వెల్ డేట్ అనౌన్స్ చేశారు. సేమ్ డేట్ నుంచి తాను వెనక్కి తగ్గేది లేదని, తన సినిమాను వాయిదా వేయడం లేదని కన్నడ రాకింగ్ స్టార్ యశ్ మరోసారి స్పష్టం చేశారు. 

Continues below advertisement

మార్చి 19న 'టాక్సిక్' vs 'ధురంధర్ 2''కేజేఎఫ్' ముందు వరకు కన్నడ ప్రేక్షకులకు మాత్రమే యశ్ తెలుసు. ఒక్కసారిగా ఆయన్ను పాన్ ఇండియా స్టార్ట్ చేశారు దర్శకుడు ప్రశాంత్ నీల్. 'కేజీఎఫ్ 2'తో భారీ బాక్సాఫీస్ హిట్ కూడా అందుకున్నారు యశ్. 'కేజీఎఫ్ 2' తర్వాత యశ్ హీరోగా నటిస్తున్న సినిమా 'టాక్సిక్: ఏ ఫెయిరీ టెల్'.

Also Read: Japan Earthquake: జపాన్‌లో భూకంపం... మన బాహుబలి ప్రభాస్ సేఫ్ - రాజా సాబ్ డైరెక్టర్ క్లారిటీ

Continues below advertisement

'టాక్సిక్'ను యశ్ ఎప్పుడో స్టార్ట్ చేశారు. షూటింగ్ శరవేగంగా చేశారు. ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 19న విడుదల చేస్తామని ఎప్పుడో అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు ఆ తేదీకి 'ధురంధర్ 2' అనౌన్స్ చేశారు. అయినా సరే వెనక్కి తగ్గలేదు యశ్.

Also ReadNivetha Pethuraj: పెళ్ళికి ముందు బ్రేకప్... స్మృతి మంధాన రూటులో హీరోయిన్ నివేదా పేతురాజ్

వంద రోజుల్లో రణవీర్ సింగ్ vs యశ్!Ranveer Singh Dhurandhar 2 vs Yash Toxic: ఇవాళ్టికి వంద రోజుల తర్వాత మార్చి 19 వస్తుంది. వంద రోజుల్లో బాక్సాఫీస్ బరిలో రణవీర్ సింగ్ వర్సెస్ యశ్ పోరు ఉంటుంది. 'ధురంధర్' విజయంతో 'ధురంధర్ 2' మీద అంచనాలు చాలా పెరిగాయి. స్పై యాక్షన్ థ్రిల్లర్ జానర్ సినిమా కావడం, 'టాక్సిక్' డిఫరెంట్ మూవీ కావడంతో ప్రేక్షకులు ఏ సినిమాపై ఎక్కువ ఆసక్తి చూపిస్తారో చూడాలి.