Andhra Pradesh News Todady | ఆ రోజు ఇంటిపైకి దాడికి రాలేదు, కక్ష పెట్టుకోవద్దు- నీకూ ఓ కొడుకు ఉన్నాడు- చంద్రబాబుకు జోగి రమేష్ హెచ్చరిక
ముఖ్యమంత్రి చంద్రబాబు తనపై కక్ష పెట్టుకున్నారని అందుకే తన కుమారుడు రాజీవ్‌ను అరెస్టు చేయించారని ఆరోపించారు మాజీ మంత్రి జోగి రమేష్. చంద్రబాబు ఇంటిపైకి ఆ రోజు దాడికి వెళ్లాలన్న కక్షతోనే ఇదంతా చేస్తున్నారని అన్నారు. అసలు ఆరోజు తాను దాడి చేయడానికి వెళ్లలేదని కేవలం చంద్రబాబును కలిసేందుకు మాత్రమే వెళ్లాలని చెప్పుకొచ్చారు. జగన్ మోహన్‌రెడ్డిపై అయ్యన్నపాత్రుడు చేసిన కామెంట్స్ తెలియజేసేందుకు మాత్రమే అక్కడికి వెళ్లినట్టు వివరించారు. చంద్రబాబును కలిసి నిరసన తెలియజేసి వ్యవస్థను సరిచేయాలనే చెప్పడానికే అలా చేశానని చెప్పారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
విశాఖ ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో పోటీకి కూటమి దూరం- బొత్స గెలుపు లాంఛనమే
విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ విజయం ఖాయమైంది. కూటమి పార్టీలు పోటీ చేయకూడదని నిర్ణయించడంతో వైసీపీ అభ్యర్థి బొత్స ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. నిన్నటి వరకు పలు రకాలుగా కసరత్తులు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు, చివరికి పోటీ చేయకూడదని నిర్ణయానికి వచ్చేశారు. నామినేషన్ చివరి రోజున ఈ పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడంతో బొత్స గెలుపు ఖరారైంది. బొత్సాతోపాటు ఒకే ఒక్క నామినేషన్ దాఖలైంది. షేక్ షఫీ అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రంగారెడ్డి జిల్లా జేసీ- ఇంట్లోనూ తనిఖీలు భారీగా నగదు స్వాధీనం
ధరణి పోర్టల్‌లో నిషేధిత జాబితాలో ఉన్న భూమిని తొలగించేందుకు లంచం తీసుకుంటూ రంగారెడ్డి జిల్లాకు చెందిన జాయింట్ కలెక్టర్ భూపాల్‌రెడ్డి ఏసీబీకి చిక్కారు. ఆయనతోపాటు కలెక్టరేట్‌లో పని చేస్తున్న సీనియర్ అసిస్టెంట్ మదన్‌మోహన్ రెడ్డి కూడా అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. ఓ వ్యక్తికి చెందిన భూమి నిషేధితజాబితాలో ఉంది. దాన్ని నార్మలైజ్ చేసి నిషేధిత జాబితా నుంచి తప్పించేలా ధరణి పోర్టల్‌లో మార్పులకు రిక్వస్ట్ పెట్టుకున్నారు. ఈ పని చేసేందుకు ఆయన డబ్బులు డిమాండ్ చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
జోగి రమేష్ కుమారుడు అరెస్టు- అగ్రిగోల్డ్ భూముల స్కామ్‌లో కీలక మలుపు
అగ్రిగోల్డ్ భూముల స్కామ్ కీలక మలుపు తిరిగింది. ఉదయం నుంచి వైసీపీ లీడర్, మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో సోదాలు చేసిన ఏసీబీ ఆయన కుమారుడిని అరెస్టు చేసింది. జోగి రమేష్ కుమారుడు ఈ స్కామ్‌లో కీలక పాత్ర పోషించారని... మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సి ఉందని చెప్పి అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఉదయం ఐదు గంటలకు ఏసీబీ అధికారులు జోగి రమేష్ ఇంట్లో సోదాలు మొదలు పెట్టారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
హైకోర్టుకు చేరిన 'స్థానికత' వివాదం, మెడికల్ సీట్ల రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు
తెలంగాణలోని మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ (కాంపీటెంట్) కోటా కింద 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ తొలి విడత కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను ఆగస్టు 3న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 4న రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభంకాగా.. నుంచి ఆగస్టు 13తో గడువు ముగియాల్సి ఉంది. అయితే ఈ గడువును మరో రెండు రోజులు పెంచుతున్నట్లు కాళోజీ వర్సిటీ రిజిస్ట్రార్ ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి