Mastermind behind the IC 814 hijacking  has been eliminated: ఖట్మాండు నుంచి ఢిల్లీకి వస్తున్న విమానాన్ని హైజాక్ చేసిన టెర్రరిస్టులు దాన్ని కాందహార్ కు  దారి మళ్లించి ముగ్గురు ఉగ్రవాదుల్ని విడిపించుకుపోయారు. ఆ విమానాన్ని హైజాక్ చేసిన వారిలో ఒకరు అబ్దుల్ రౌఫ్ అజహర్. విడిపించుకుపోయిన ఉగ్రవాదుల్లో ఒకరు అయిన మసూద్ అజహర్ సోదరుడు. అతను అపరేషన్ సింధూర్ లో మరణించాడు. అతను చనిపోలేదన్న విషయాన్ని దాచి పెట్టాలనుకున్నారు కానీ.. సాధ్యం కాలేదు. చచ్చిపోయినట్లుగా వెలుగులోకి వచ్చింది. మసూద్ అజర్ కుటుంబసభ్యులు పధ్నాలుగు మంది చనిపోయారు. వారిలో ఈ అబ్దుల్ రౌఫ్ అజహర్ కూడా ఒకరు. అందుకే తాను కూడా  చనిపోయి ఉంటే బాగుండేదని మసూద్ అజర్ వాపోయాడు.  

ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ IC-814 అపహరణలో అబ్దుల్ రౌఫ్ అజహర్  ముఖ్య పాత్ర పోషించాడు. ఈ ఘటనలో పాకిస్తాన్  ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) ,తాలిబాన్ సహకారంతో  భారత జైళ్లలో ఉన్న 36 మంది జిహాదీలను విడుదల చేయడానికి ఒత్తిడి చేశారు. ఈ ఘటన ఏడు రోజుల పాటు సాగింది, చివరికి భారత ప్రభుత్వం మసూద్ అజహర్‌తో సహా ముగ్గురు ఉగ్రవాదులను విడుదల చేసింది.  

 2001 భారత  పార్లమెంట్ పై  దాడి, 2002లో డానియల్ పెరల్ అపహరణ , హత్య, 2008 ముంబై ఉగ్రదాడులు, 2016 పఠాన్‌కోట్ దాడి, 2019 పుల్వామా దాడిలలో కూడా పాల్గొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అబ్దుల్ రౌఫ్ అజహర్ తాలిబాన్, అల్-ఖైదా, లష్కర్-ఎ-తొయిబా,   హక్కానీ నెట్‌వర్క్‌తో బలమైన సంబంధాలు కలిగి ఉన్నాడు, వీరితో శిక్షణా శిబిరాలను కూడా నిర్వహించాడు.  

 2010 డిసెంబర్ 2న యునైటెడ్ స్టేట్స్ ట్రెజరీ డిపార్ట్‌మెంట్ అతన్ని ఉగ్రవాదిగా పేర్కొంది. భారతదేశం,  యునైటెడ్ స్టేట్స్ ఐక్యరాష్ట్ర సమితి సెక్యూరిటీ కౌన్సిల్ (UNSC)లో అతన్ని "గ్లోబల్ టెర్రరిస్ట్"గా  ప్రకటించాలని ప్రతిపాదించినప్పుడు, చైనా 2022 , 2023లో ఈ ప్రతిపాదనను అడ్డుకుంది