పరిశుభ్రత పాటించడం మంచి జీవన విధానంలో చాలా ముఖ్యమైన అంశం. మీరు ఇంకొకరితో కలిసి ఉంటున్నారంటే ఇంకా ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే మీరు శుభ్రతను పాటించడంలో నిర్లక్ష్యం చేస్తే అది అవతలి వాళ్ళను ఇబ్బందికి గురి చేయవచ్చు. ఇలాంటి సంఘటన ఓ అమ్మాయికి ఎదురైంది. ఒక ఫ్లాట్ లో కలిసి ఉంటున్న అమ్మాయి స్నానం చేయడం లేదని, వ్యక్తిగత శుభ్రత పాటించడంలో నిర్లక్ష్యం చేస్తుంటే, ఆమె నుంచి వచ్చే కంపును భరించలేక మరో అమ్మాయి రూమ్ నుంచి బయటకు గెంటేసింది. ఆ అమ్మాయి చెప్పిన వివరాల ప్రకారం తన రూంమేట్ గత 4నెలలుగా స్నానం కూడా చెయ్యలేదు అని తెలిసింది.
ఒక రెడ్డిట్ పోస్టు లో ఆవేశంతో ఊగిపోతూ ఓ 23 ఏళ్ల యువతి వ్యక్తిగత శుభ్రత పాటించని తన రూంమేట్ తో తను పడ్డ ఇబ్బందుల గురించి ఇలా రాసింది. ఆమె రోజు 2 గంటలు జాగింగ్ కు వెళ్లి వచ్చిన, ఏ రోజు కూడా స్నానం చెయ్యలేదని, దాని వల్ల ఫ్లాట్ అంత దుర్వాసన వచ్చేదని తెలిపింది. అమ్మాయి వివరాలు చెప్తూ "తాను ఆ అమ్మాయితో నాలుగు నెలలుగా కలిసి ఉంటున్నాను, ఆమెకి వ్యక్తిగత శుభ్రతపై ఎలాంటి శ్రద్ధ లేదు, నేను ఇంకా ఆమెతో కలిసి ఉండలేను. ఆమె అసలు స్నానం కూడా చెయ్యదు. గత నాలుగు నెలల్లో ఒక్క సారి కూడా స్నానం చేయలేదు. రోజు రెండు గంటలు జాగింగ్ కు వెళ్లి వచ్చిన స్నానం చెయ్యదు. ఆ దుర్వాసనను నేను ఇంక భరించలేను. దాని వల్ల నేను అనారోగ్యానికి గురి అవుతున్నాను. ఈ విషయం గురించి ఆమెతో మాట్లాడితే నేను చేస్తా అని చెప్పడం తప్ప ఎప్పుడు చెయ్యలేదు. ఎన్ని సార్లు చెప్పిన పెడచెవిన పెట్టింది ఆ అమ్మాయి.
వాసనతో పసిగట్టిన ఇంటి యజమాని..
మిర్రర్ రిపోర్ట్ ప్రకారం.. 23 ఏళ్ల ఓ యువతి 18 ఏళ్ల మరో యువతితో కలిసి ఓ రూమ్ లో ఉంటుందని రెడ్డిట్ పోస్టులో తెలిపింది. అయితే గత నాలుగు నెలలుగా వీరిద్దరూ కలిసి ఉంటున్నారు. కానీ రూమ్ మేట్ పరిశుభ్రతను తట్టుకోలేక రూమ్ నుంచి ఆమెను గెంటేసింది ఇరవై మూడేళ్ల యువతి. ఆ ఫ్లాట్ కు వచ్చిన యజమానికి విషయం మొత్తం ఆ వాసన ద్వారా అర్ధం అయ్యింది. అతను ఆ అమ్మాయి ని తనకు ముప్పై రోజుల సమయం వెళ్ళిపోవడానికి ఇస్తున్నానని లేదంటే బలవంతంగా గెంటేస్తా అని చెప్పారు. ఎన్నిసార్లు చెప్పినా రూమ్ మేట్ వినిపించుకోలేదని, ఆ వాసన, కంపు భరించలేక ఈ అమ్మాయి తన రూంమేట్ ను బలవంతంగా గెంటివేసింది. దీని గురించి ఆలోచిస్తుంటే రెడ్డిట్ వినియోగదారులు ఆమెకు మద్దతుగా నిలిచారు.
మద్దతుగా నిలిచిన రెడ్డిట్ యూజర్లు
ఓ నెటిజన్ "నువ్వు గెంటేయట్లేదు, ఇంకా ఆమె అలాగే దుర్వాసనతో అక్కడే ఉంటే.. మీ అపార్ట్మెంట్ అంతా వాసన వచ్చి ఆ యజమాని ఆమెను గెంటేసేవాడు. నువ్వు ఆమెతో ఈ విషయం గురించి మాట్లాడావు, ఆమె మాత్రం మారకపోవడం తప్పిదమే"అని అన్నారు. మరో నెటిజన్ "నీ రూం మేట్ చాలా అదృష్టవంతురాలు , మీ యాజమాని ఆ రూమ్ కి వాసనతో చేసిన నష్టానికి డబ్బులు ఏమి అడగలేదు. వాసన గోడలు, దుస్తుల్లోనూ ఉంటుంది. ఆ వాసన ధూమపానం, వాడి వదిలేసిన సాక్సులు మొదలైన వాటి నుంచీ వచ్చే వాసనలా కాదు. దాని వల్ల అపార్ట్మెంట్ వాసులు మరింత ఇబ్బందిపడితే, మీ సమస్య రెట్టింపు అయ్యేది" అని అన్నారు.