టాలీవుడ్ లో తెరకెక్కిన పలు సినిమాలు ఈ ఏడాది దేశవ్యాప్తంగా సంచలన విజయాలు అందుకోగా, మరికొన్ని సినిమాలు మాత్రం భారీ అంచనాలతో వచ్చినా, బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడ్డాయి. ఈ ఏడాది టాలీవుడ్ లో ఘోర పరాజయం పొందిన టాప్ 10 మూవీస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..


 1. సన్ ఆఫ్ ఇండియా - ఆల్ టైమ్ డిజాస్టర్


అసలు ఈ సినిమా ఏంటో? ఈ సినిమా ద్వారా ఏం చెప్పాలి అనుకున్నాడో దర్శకుడికే తెలియాలి. మోహన్ బాబు కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో కంటెంట్, మేకింగ్, విజువల్ ఎఫెక్ట్స్, పెర్ఫార్మెన్స్ అన్నీ వరెస్ట్ అని చెప్పుకోవచ్చు.


2. రాధే శ్యామ్ –పాన్ ఇండియా డిజాస్టర్


ప్రభాస్ నటించిన పాన్ ఇండియన్ మూవీ భారీ అంచనాలతో విడుదల అయ్యింది. కానీ, బాక్సాఫీస్ ముందు డిజాస్టర్ గా నిలిచింది. స్టోరీలైన్ బాగానే ఉన్నా, పేలవమైన ఎగ్జిక్యూషన్, ఎమోషనల్ కంటెంట్ లేకపోవడం, లాజిక్స్ మిస్ అవ్వడంతో ఈ మూవీ పాన్ ఇండియా డిజాస్టర్ గా నిలిచింది. కానీ, ఓటీటీలో మాత్రం బాగానే నడిచింది. 


3. ఆచార్య డబుల్ మెగా డిజాస్టర్


చిరంజీవి, రామ్ చరణ్ తో కొరటాల శివ సినిమా అనగానే ఓరేంజ్‌లో ఉంటుందని అందరూ అనుకున్నారు. ఈ సినిమా రికార్డుల మోత మోగించడం ఖాయం అనుకున్నారు. కానీ, తీరా విడుదలయ్యాక డబుల్ మెగా డిజాస్టర్ గా నిలిచింది. ఓటీటీలో చూడటానికి కూడా ప్రేక్షకులు ఇబ్బంది పడ్డారు. 


4. ఖిలాడీ - మాస్ డిజాస్టర్


మాస్ మహారాజా రవితేజ సినిమా అయితే పెద్ద హిట్టు లేదంటే భారీ ఫట్టు అనేలా పేరు సంపాదించాడు.  క్రాక్ లాంటి మాస్ హిట్స్ తర్వాత రవితేజ ఖిలాడీ లాంటి పరమ చెత్త సినిమా చేశాడు.  ఈ మధ్య కాలంలో రవితేజ నటించిన ఘోరమైన సినిమా ఇదే అని చెప్పుకోవచ్చు.


5. విరాట పర్వం – రెవల్యూషనరీ డిజాస్టర్


సాయి పల్లవి – రానా లాంటి టాప్ యాక్టర్లు నటించిన ‘విరాట పర్వం’  కథ, మేకింగ్, పెర్ఫార్మెన్స్ వైజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ వర్క్. అందులో సందేహం లేదు. కానీ, బాక్సాఫీస్ ఈ సినిమా సత్తా చాటలేకపోయింది. విరాట పర్వం ఓ రెవల్యూషనరీ డిజాస్టర్ గా మిగిలింది.


6. థ్యాంక్యూ - సైలెంట్ డిజాస్టర్


నాగ చైతన్య, విక్రమ్ కె.కుమార్ కాంబోలో వచ్చిన ఈ సినిమా కూడా డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమా కథను ప్రేక్షకులకు నచ్చేలా చూపించడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. ఈ సినిమా థియేటర్లకు ఎప్పుడు వచ్చిందో? ఎప్పుడు వెళ్లిందో? కూడా చాలా మందికి తెలియదు. మొత్తానికి ఈ సినిమా సైలెంట్ డిజాస్టర్ గా నిలిచింది.


7. లైగర్ – పాన్ ఇండియా షేక్ డిజాస్టర్


ఈ సినిమాతో పూరి జగన్నాథ్ మళ్లీ తన సత్తా చాటుకుంటాడు అని అందరూ అనుకున్నారు. కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఘోరాతి ఘోరమైనా డిజాస్టర్ అందుకున్నారు. విజయ్ దేవరకొండ లాంటి హీరో, కరణ్ జోహార్ లాంటి ప్రొడ్యూసర్ తో కలిసి ఇలాంటి సినిమా చేస్తారని ఎవరూ ఊహించలేదు. 


8. రంగ రంగ వైభవంగా రొమాంటిక్ డిజాస్టర్


‘కొత్తగా లేదు ఏంటి’ అని ఈ సినిమాలో ఒక పాట ఉంది. ఈ సినిమా గురించి చెప్పాల్సి వస్తే కూడా అదే చెప్పుకోవచ్చు. ఓవర్ డోస్ రొమాంటిక్ సీన్స్ తప్ప,  కొత్తగా  ఏమీ లేదు.  ఈ సినిమా రొమాంటిక్ డిజాస్టర్ అని చెప్పుకోవచ్చు.


9. నేను మీకు బాగా కావాల్సినవాడిని - అబ్బవరం రొటీన్ డిజాస్టర్


కిరణ్ అబ్బవరం వరుసగా సినిమాలు చేస్తున్నా, అవి హిట్టా? ఫట్టా? అని చూసుకోవడం లేదు. ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ సినిమా కూడా  రొటీన్ డిజాస్టర్ గా నిలిచింది.


10. ఘోస్ట్ - కింగ్ సైజ్ డిజాస్టర్


నాగార్జున అంటే రకరకాల ప్రయోగాలు గుర్తొస్తాయి. కానీ ‘ఘోస్ట్’ సినిమా విషయంలో ప్రయోగం మిస్ ఫైర్ అయ్యింది. బలమైన కథ లేకపోవటం తో ఈ మూవీ కింగ్ సైజ్ డిజాస్టర్ అయ్యింది.


Read Also: తండ్రి మాట వినకపోతే బన్నీలా అవుతారు - అల్లు అర్జున్‌పై బండ్ల గణేష్ సెటైర్లు