WhatsApp :  స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ప్రతి ఒక్కరి శరరీంలో ఓ భాగం. దేన్నైనా మర్చిపోతామేమో కానీ సెల్‌ఫోన్‌ను మర్చిపోం. అలాటి సెల్ ఫోన్‌ ఓపెన్ చేస్తే మొదటిగా చూసుకునేది వాట్సాప్. గతంలో ఫేస్ బుక్ ఆ ప్లేస్‌లో ఉండేది. కానీ అది రాను రాను బోర్ కొట్టేసింది. ఇప్పుడా ప్లేస్ వాట్సాప్‌ది. ఒకటికి రెండు వాట్సాప్‌లు క్లోన్ చేసుకుని మరీ పెట్టుకుని వాడే యూజర్లు తక్కువేం కాదు. పర్సనల్.. గ్రూపులు.. ఆఫీసులు.. వ్యాపారం.. ఫ్రెండ్స్ .. ఇాలా ప్రతి ఒక్కరిని కనెక్ట్ చేసి ఉంచింది వాట్సాప్. మరి అలాంటి వాట్సాప్ ఒక్క సారిగా ఆగిపోతే గుండె ఆగిపోదూ..! అదే పరిస్థితి ఎదురయింది. నీకు నాకూ కాదులెండి.. ప్రపంచం మొత్తం అందరిదీ అదే పరిస్థితి. 


వాట్సాప్ పని చేయక కంగారు పడిన వినియోగదారులు


అమ్మో వాట్సాప్ ఇక రాకపోతే మన పరిస్థితేమిటి అనుకోని వారి సంఖ్య తక్కువేం కాదు. అందుకే అప్పటికప్పుడు.. చాలా మంది ఇతర మెసెజింగ్ యాప్స్ ఏమైనా ఉన్నాయా వెదుక్కుని డౌన్ లోడ్ చేసుకోవడం ప్రారంభించారు. ఓ వైపు ఆ పని చేస్తూనే మరో వైపు..  వాట్సాప్ పని చేస్తుందా లేదా అని..కంగారు కంగారుగా చెక్ చేసుకోవడం ప్రారంభించారు. ఖచ్చితంగా లంచ్ టైమ్‌లో ఆగిపోయిన వాట్సాప్ మరో రెండు గంటల తర్వాత పునరుద్ధరణ అయింది. ఇంకా రాలేదు.. ఇంకా రాలేదు అనుకుంటూ..  వాట్సాప్ హాలిక్స్‌  లంచ్ కూడా మానేశారు. క్షణం క్షణం వాట్సాప్ చూసుకుంటూ గడిపేశారు. మరీ స్టోర్ అయితేనే కానీ వారికి మనసు కుదుటపడలేదు. 


టెక్నాలజీకి దాసోహం అయ్యామా ?


వాట్సాప్ అంటే ఇప్పుడు కేవలం మెసెజులు పంపున్ యాప్ మాత్రమే కాదు. అంతకు మించి. వాట్సాప్ కాసేపు పని చేయకపోతే కాళ్లూ చేతులు ఆడవు. మనం గుర్తు పెట్టుకోవాలనుకున్నవన్నీ వాట్సాప్ గుర్తు పెట్టుకుంటుంది. అందుకే మనం చాలా వాటిని పట్టించుకోం. అవసరం వచ్చినప్పుడు వాట్సాప్ లో అలా వెదుక్కుంటే.. ఇలా వచ్చి పడుతుంది. అక్కడ్నుంచి ప్రారంభమైన ఈ వాట్సాప్ విస్తరణ.. ఉద్యోగంలోకి చొచ్చుకు వచ్చింది. ప్రతి ఆఫీసు ఇప్పుడు ఐదారు వాట్సాప్ గ్రూపులు మెయిన్ టెయిన్ చేస్తూ ఉంటుంది సమాచారం అందకపోతే.. గందరగోళమే. చివరికి ఏం జరుగుతుందో అంచనా వేయడం కష్టం. 


మనుషుల్ని టెక్నాలజీ ఆడిస్తోందా ?


పెద్దలు టెప్పినట్లుగా టెక్నాలజీని వాడుకోవాలి.. మనుషుల్ని ప్రేమించాలి. కానీ ఇప్పుడు వాడుకునేది.. ప్రేమించేది కూడా టెక్నాలజీనే. మనుషుల్ని ప్రేమిస్తున్నామా లేదా అన్న అంశాన్ని పక్కన పెడితే ఇప్పుడు టెక్నాలజీ మన జీవితంలో పెనవేసుకుపోయింది. ఓ రెండు గంటలకు అది దూరమైతే ఎంత మానసిక ఆందోళన కలిగిందో...  అది శాశ్వతంగా లేకుండా పోయిందనుకుంటే.. అసలు భరించగలమా ? అలాంటి ప్రపంచంలోకి వచ్చేశారు. ఒకప్పుడు ల్యాండ్ ఫోన్ ఉంటే గొప్ప.. కానీ ఇప్పుడు సెల్ ఫోన్.. స్మార్ట్ ఫోన్ జేబుల్లోకి వచ్చేసింది. అప్పట్లో ఎలా బతికామో అని అందరూ ఆశ్చర్యపోతూంటారు. కానీ అప్పట్లోనే క్వాలిటీ లైఫ్ ఉందని ఎక్కువ మంది భావిస్తూంటారు.. అప్పట్లో జీవితాన్ని చూసిన వాళ్లు. ఏదైనా కానీ వాట్సాప్ రెండు గంటలు ఆగిపోవడం... మనం దేనికి బానిసలవుతున్నామో మరోసారి గుర్తు చేసిందని అనుకోవచ్చు.