Golden Temple:
అర్ధరాత్రి పేలుడు
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో గోల్డెన్ టెంపుల్‌కు సమీపంలో బాంబు పేలుడు కలకలం రేపింది. హెరిటేజ్ స్ట్రీట్‌లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. శనివారం (మే 6వ తేదీ) అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. పార్కింగ్ ప్లేస్‌కు కొంత దూరంలో భారీ శబ్దం వినిపించింది. ఈ పేలుడుతో పక్కనే ఉన్న ఓ రెస్టారెంట్ పాక్షికంగా ధ్వంసమైంది. స్థానికుల సమాచారంతో వెంటనే ఘటనా స్థలానికి వెళ్లారు పోలీసులు. ఈ పేలుడు వెనక కారణమేంటో విచారణ చేపడుతున్నారు. కమిషనర్ ఆఫ్ పోలీస్ అమృత్‌సర్ ట్విటర్ అకౌంట్‌లో ఈ ఘటనకు సంబంధించిన వివరాలు పోస్ట్ చేశారు. అమృత్‌సర్‌లో పేలుడు జరిగిందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని తెలిపారు. ఈ పేలుడులో కొందరు స్వల్పంగా గాయపడ్డారని వెల్లడించారు.
"అమృత్‌సర్‌లో పేలుడు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదు. పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి. విచారణ కూడా కొనసాగుతోంది. అనవసరంగా ప్యానిక్ అవ్వద్దు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం. అందరూ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడేందుకు సహకరించండి. ఫ్యాక్ట్ చెక్ చేసుకున్న తరవాతే ఏ సమాచారాన్నైనా షేర్ చేయండి"
- అమృత్‌సర్ పోలీస్ కమిషనర్
ఈ పేలుడుకి కచ్చితమైనా కారణమేంటో ప్రస్తుతానికి పోలీసులు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. గ్యాస్‌పైప్‌లైన్ లీకేజ్ వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సమీపంలో ఉన్న బిల్డింగ్‌ల కిటికీలు మాత్రం ధ్వంసమయ్యాయని, అంతకు మించి ఎక్కువగా ఆస్తినష్టం వాటిల్లలేదని స్పష్టం చేశారు.
లుధియానాలో గ్యాస్ లీక్..
పంజాబ్‌లోని లుధియానాలోని ఇటీవలే ఓ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ అయింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. 11 మంది కోమాలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం వాళ్లను దగ్గర్లోని హాస్పిటల్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు. NDRF సహా స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అంతకు ముందు 6గురు చనిపోయారని ధ్రువీకరించిన పోలీసులు...ఆ తరవాత మృతుల సంఖ్య పెరిగిందని వెల్లడించారు.
"గియాస్‌పురలోని ఓ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ అయ్యి అంత మంది చనిపోవడం చాలా బాధాకరం. పోలీసులతో పాటు ప్రభుత్వ అధికారులు, NDRF సిబ్బంది ఘటనా స్థలంలోనే ఉన్నారు. అవసరమైన సాయం అందిస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులకు సంతాపం తెలుపుతున్నాను."
- భగవంత్ మాన్, పంజాబ్ సీఎం
Also Read: Wrestlers' Protest: రెజ్లర్లకు రైతు సంఘాల మద్దతు, జంతర్‌మంతర్ వద్ద భారీ బందోబస్తు