హిమాచల్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. సోలాన్ జిల్లా నాలాగఢ్ లోని బరోటివాలాలో కొండపై నుంచి బస్సు కిందపడింది. ఘటనలో 32 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరందరినీ స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం తెలిపింది.
Also Read: Suresh Gopi: నన్ను ‘ఆవు పేడ’ అని అంటున్నందుకు గర్వంగా ఉంది.. నటుడు, ఎంపీ స్ట్రాంగ్ కౌంటర్
తప్పిన పెను ప్రమాదం..
ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్లో త్రుటిలో ఓ ప్రమాదం తప్పింది. భారీ వర్షాలకు శుక్రవారం సాయంత్రం వీర్ భట్టీ ప్రాంతంలో రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో 14 మంది ప్రయాణికులతో కేఎంఓయూకు చెందిన బస్సు అల్మోరా నుంచి హల్దివానికి వెళ్తోంది. బస్సుకు అడుగుల దూరంలోనే ఈ ఘటన జరగటం వల్ల ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. కొండచరియలు విరిగిపడుతున్నప్పుడు కొంతమంది ప్రాణాలు కాపాడుకునేందుకు బస్సు కిటికీల్లోంచి దూకేశారు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.
దిల్లీలో కుండపోత..
దిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దిల్లీలోని సఫ్దార్‌గంజ్ ప్రాంతంలో 24 గంటల్లో రికార్డు స్థాయిలో 13.8 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆగస్టు నెలలో దిల్లీలో ఒక రోజులో ఇంత భారీ స్థాయిలో వర్షం కురవడం 13ఏళ్లలో ఇదే తొలిసారి.
వర్షం కారణంగా దిల్లీ రైల్వే స్టేషన్‌లోకి వరద నీరు చేరింది. అనేక రైళ్లు రద్దయ్యాయి. పలు అండర్‌పాస్ రోడ్లలో భారీగా నీరు చేరడంతో ఆ మార్గాల్లో రాకపోకలను నిలిపివేశారు.
Also Read: JK Encounter: జమ్ముకశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ముగ్గురు ముష్కరులు హతం