Amazon Rainforest Hidden City:
వేల ఏళ్ల నాటి నగరం..
అమెజాన్ అడవుల్లో 3వేల ఏళ్ల నాటి నగరం బయట పడింది. ఈక్విడార్‌లో ఈ సిటీ వెలుగులోకి వచ్చింది. ఉపానో వ్యాలీలో (Upano valley) నిర్మించిన ఈ నగరంలో ఎన్నో రోడ్లు, కాలువలున్నాయని అక్కడి BBC వెల్లడించింది. రిమోట్ సెన్సింగ్ మెథడ్ LiDARతో ఈ సిటీని కనుగొన్నారు. దీన్నే laser scanningగానూ పిలుస్తారు. అమెజాన్ ప్రాంతంలో కనుగొన్న నగరాల్లో ఇదే అత్యంత పురాతనమైందని సైంటిస్ట్‌లు వెల్లడించారు. ఈ నగరంపై మరింత అధ్యయనం చేస్తే అప్పటి నాగరికత గురించి ఆసక్తికర విషయాలు తెలిసే అవకాశముందని చెబుతున్నారు.
"అమెజాన్ ప్రాంతంలో ఇప్పటి వరకూ బయటపడ్డ నగరాల్లో ఇదే అత్యంత పురాతనమైంది. ఇప్పటి వరకూ అమెజాన్ నాగరికత గురించి మనకు తెలిసిన విషయాలన్నీ పైపైనే. కానీ...ఈ సిటీని అధ్యయనం చేస్తే ఈ నాగరికత గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు తెలిసే అవకాశముంది. అమెజాన్ సంస్కృతిలో ఎలాంటి మార్పులు జరిగాయో అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో ప్రజలంతా ఒంటిపై దుస్తులు లేకుండానే జీవించారు. చిన్న చిన్న హట్స్‌లో తల దాచుకున్నారు. కానీ...ఈ సిటీని చూస్తుంటే వాళ్ల జీవనశైలి మారిందేమో అనిపిస్తుంది"
- సైంటిస్ట్‌లు
చెక్కతో భవనాలు..
అమెజాన్‌లో ఇప్పటి వరకూ ఎన్నో కొలంబియన్ నాగరికతకు సంబంధించిన ఆనవాళ్లు కనిపించాయి. ఇప్పుడు బయట పడ్డ సిటీ 3వేల నుంచి 15వందల సంవత్సరాల నాటిది అని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాంతంలో దాదాపు వెయ్యేళ్ల పాటు ప్రజలు నివాసమున్నట్టు చెబుతున్నారు. నిజానికి ఈ సర్వేని 2015లోనే చేశారు. కానీ...ఇన్నాళ్లకు ఆ వివరాలు బయట పెట్టారు. చెక్కతో నిర్మించిన భవనాలు కనిపించాయి. దాదాపు 25 కిలోమీటర్ల మేరకూ రోడ్లు నిర్మించినట్టు తేలింది.
Also Read:
Swami Vivekananda: స్వామి వివేకానంద గురించి ఇలా మాట్లాడితే ఎవరైనా ఇంప్రెస్ అయిపోతారు!