24 hours begging challenge Kolkata man begs to see how much he can earn: ముంబైలో బిచ్చగాళ్లు నెలకు లక్షసంపాదిస్తారట.. బెంజ్ కార్లు.. ఐ ఫోన్లు కూడా ఉన్నాయట అనే కబుర్లకు సోషల్ మీడియాలో కొదవ ఉండదు. ఇలాంటివి చూసి చూసి.. చదివి చదివి పార్థదేబ్ అనే బెంగాలీ యువకుడు..తాను కూడా బిచ్చగాడ్ని కావాలనుకున్నాడు. ఏ పని చేయలేక ముందుగా ఓ యూట్యూబ్ చానల్ పెట్టుకున్న టైం పాస్ చేస్తున్న పార్థదేబ్..మొదటగా ఓ రోజు అడుక్కుని తన టాలెంట్ ను పరీక్షించుకోవాలనుకున్నారు.
అనుకున్నట్లుగానే ఓ రోజు బిచ్చగాడిలా వేషం వేసుకుని మంచి ముహుర్తం చూసుకుని .. రంగంలోకి దిగిపోయాడు. కోల్ కతాలో మంచి బిజీ రోడ్ ను చూసుకుని అడుక్కోవడం ప్రారంభించారు. మొత్తం ఇరవై నాలుగు గంటల పాటు అడుక్కోవాలనుకున్నాడు. అయితే మొత్తం ఎక్స్ పీరియన్స్ ను ఎనాలసిస్ చేసుకోవడానికి..తన యూట్యూబ్ చానల్లో పెట్టుకోవడానికి రికార్డు చేసుకునే ఏర్పాట్లు చేసుకున్నాడు. రోజంతా అడుక్కున్నాడు. చాలా సినిమాల్లో చూసిన ప్రయోగాలు చేశాడు. అమ్మా.. అయ్యా అని అరుపులు అరిచాడు. అన్ని చేసిన తర్వాత.. ఇరవై నాలుగు గంటల తర్వాత తన బొచ్చెలో పడిన డబ్బులను లెక్క చూసుకున్నాడు. మొత్తంగా కలిసి 32 అంటే ముఫ్పై రెండు రూపాయలు ఉన్నాయి. ఈ డబ్బుల్ని చూసి పార్థదేబ్ కు మైండ్ బ్లాంక్ అయిపోయింది.
అడుక్కోవడం అంత అంత సులువు కాదని పార్థదబేబ్‌కు అర్థం అయిపోయింది. అది కూడా ఓ స్కిల్ అని.. ఇలా రంగంలోకి దిగిపోయి అలా అడుక్కోగానే అందరూ డబ్బులు వేస్తారనుకోవడం అమాయకత్వం అని ఆయనకు స్పష్టత వచ్చింది. అందుకే తన బెగ్గింగ్ ఎక్స్ పీరియన్స్ వీడియోను సోషల్ మీడిాయోల షేర్ చేశాడు. తన ఇరవై నాలుగు గంటల బెగ్గింగ్ చాలెంజ్ ఎక్స్ పీరియన్స్ ను పంచుకున్నాడు.
పార్థదేబ్ చేిసన ప్రయోగానికి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. పార్థదేబ్ అడుక్కోవడాన్ని చాలా తేలికగా తీసుకున్నారని అది యూట్యూబ్ చానల్ లో వీడియోలు చేయడం కన్నా కష్టమని కొంత మంది సైటెర్లు వేశారు. మొత్తంగా పార్థదేబ్.. చాలా పనుల కన్నా అడుక్కోవడం కష్టమని నిరూపించాడు.