Madhya pradesh Bus Accident :  మధ్యప్రదేశ్‌లో  మంగళవారం తెల్లవారుజామున వంతెన పై నుంచి బస్సు పడిన ఘటనలో 22 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. 31మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఖోరేగావ్ జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో ముగ్గురు చిన్నారులు, ఆరుగురు మహిళలు ఉన్నారు. డోంగార్‌గావ్ సమీపంలోని బరోడ్ నదిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సు ఖోరేగావ్ నుంచి ఇండోర్‌కు వెళ్తోంది. వంతెనపై బస్సు అదుపు తప్పి  నదిలో పడిపోయింది. నీరు లేకపోవడంతో నేరుగా భూమిని తాకింది బస్సు. రమాద సమయంలో బస్సులో దాదాపు 80మందికిపైగా ఉన్నారు. చనిపోయిన వారిలో బస్సు డ్రైవర్, క్లీనర్ కూడా ఉన్నారు.                                                 


 





 


ప్రమాదం గురించి సమాచారం అందిన  వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్ర  గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని మెరుగైన వైద్యం కోసం ఇండోర్‌కు తరలించే ప్రయత్నాలు చేస్తున్నట్టు అధికారులు చెప్పారు. ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ప్రమాదంపై మధ్యప్రదేశ్ సీఎం శివ్‌రాజ్ సింగ్ చౌహన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించారు. తీవ్రంగా గాయపడినవారికి రూ.50 వేలు, స్వల్పంగా గాయపడినవారికి రూ.25 వేలు ఆర్ధిక సాయం అందజేయనున్నట్టు తెలిపారు.                     





 అటు కేంద్రం కూడా రూ.2 లక్షల మేర ఆర్ధిక సాయం ప్రకటించింది.