అమెరికాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. న్యూయార్క్‌లో ఓ 19 అంతస్తుల అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 19 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో 9 మంది చిన్నారులు ఉన్నారు.
మరణాలు పెరిగే అవకాశం..
అపార్ట్‌మెంట్‌లోని రెండు, మూడో అంతస్తులో ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. మంటలు వేగంగా ఇతర అంతస్తులకు వ్యాపించినట్లు చెప్పారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఈ ప్రమాదంలో మరో 60 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో 13 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. దాదాపు 200 మంది అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. భవనంలో చిక్కుపోయిన వారిని కాపాడారు. మరణాలు సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అన్నారు. క్షతాగాత్రులు త్వరగా కోలుకోవాలని నగర మేయర్ ఆకాంక్షించారు.
Also Read: షాకింగ్ వీడియో: విహారంలో విషాదం.. పర్వతం విరిగి బోటుపై పడింది
Also Read: ABP C-Voter Survey: యూపీలో భాజపా హవా.. ఉత్తరాఖండ్‌లోనూ కాషాయం జోరు.. పంజాబ్‌లో మాత్రం!