15 month old child abused at Noida daycare : బిజీ జీవితంలో పిల్లల్ని చూసుకునేందుకు పెద్దవాళ్లు ఉండటం లేదు. తల్లిదండ్రులకు తీరిక ఉండటం లేదు. అందుకే డే కేర్ సెంటర్లు అన్ని చోట్లా స్థాపించారు. కానీ వాటిలో పిల్లల్ని ఎలా చూస్తున్నారన్నదానిపై తల్లిదండ్రులకు అవగాహన ఉండటం లేదు. ఆ చిన్న పిల్లలకు తమను డే కేర్‌లో హింసించాలని చెప్పడం కూడా చేతకాదు. నోయిడా డే కేర్ లో జరిగిన ఈ ఘటన... డే కేర్‌లో పిల్లల్ని వదిలి వెళ్లేవారికి షాక్‌కు గురి చేస్తుంది.
నోయిడాలోని సెక్టార్ 142లో ఉన్న బ్లిప్పీ డేకేర్ సెంటర్‌లో పనిచేస్తున్న ఒక మహిళా కార్యకర్త, 15 నెలల చిన్నారిపై దాడి చేసింది. సీసీటీవీ పుటేజ్‌లో ఈ మహిళ చిన్నారిని మూడుసార్లు నేలపై విసిరి, వీపు , ముఖంపై కొట్టడం, అలాగే బిడ్డ కాలుపై కొరకడం వంటివి చేసినట్లుగా కనిపిస్తుంది. బిడ్డ శరీరంపై కొరికిన గుర్తులు , ఇతర గాయాలు కనిపించాయి. ఈ దారుణమైన దాడి సీసీటీవీలో రికార్డ్ అయింది. సోషల్ మీడియాలో వైరల్ అయింది.
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా, సెక్టార్ 142 పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేశారు. ఆ చిన్నారిపై దాడికి పాల్పడిన యువతి మైనర్ కావడంతో, ఆమెను జువెనైల్ హోమ్‌కు పంపారు. డేకేర్ సెంటర్ యజమానిని కూడా ప్రశ్నించడానికి అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనలో బాధితురాలైన 15 నెలల చిన్నారి, దాడి చేసిన యువతి మైనర్ కావడంతో, చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్, బేసిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌కు సమాచారం అందించాపు, డేకేర్ యజమానిపై కూడా చర్యలు తీసుకోవడానికి సంబంధిత అధికారులకు లేఖ రాశారు. ఇతర డేకేర్ సెంటర్‌ల లైసెన్స్‌లు, రిజిస్ట్రేషన్‌లను తనిఖీ చేయాలని నిర్ణియంచారు.
ఈ ఘటన సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది, డేకేర్ సెంటర్‌లలో పిల్లల భద్రతపై సమాజంలో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటన డేకేర్ సౌకర్యాలలో సరైన నియంత్రణ , పర్యవేక్షణ లోపాలను బహిర్గతం చేసింది.