Royal Enfield Hunter 350 Price Price, Mileage And Features: భారతదేశంలోనే కాదు రాయల్ ఎన్‌ఫీల్డ్‌ బైకులకు ప్రపంచమంతా డైహార్డ్‌ ఫ్యాన్స్ ఉన్నారు. వయసుతో సంబంధం లేకుండా, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బండితో రోడ్డుపై చక్కర్లు కొడుతుంటారు. ఈ బ్రాండ్‌లో హంటర్ 350 కూడా బాగా ఆకట్టుకుంది. దీని స్టైలిష్ లుక్‌కు యువతలో చాలా క్రేజ్ ఉంది. రాయల్ ఎన్‌ఫీల్డ్‌ హంటర్ 350 బాహ్య రూపం స్లీక్‌ డిజైన్‌తో ఆకట్టుకుంటుంది. దీని షార్ప్ హెడ్‌ల్యాంప్స్‌ & ఎయిరోడైనమిక్ ఫెయిరింగ్స్‌ ఈ మోటార్‌ సైకిల్‌కు దూకుడైన రూపాన్ని ఇస్తాయి. మెటాలిక్ ఫినిష్‌తో కూడిన ఫ్యూయల్ ట్యాంక్‌ & క్లాసిక్ ఎగ్జాస్ట్ డిజైన్ ఈ బైక్‌తో మెసిరిపోతుంది. ఆకర్షణీయమైన కలర్‌ ఆప్షన్స్‌, స్టైల్‌గా ఉండే అలాయ్ వీల్స్ హంటర్ 350కు ప్రత్యేక ఫీల్‌ అందిస్తాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ హంటర్ 350 ధర తెలుగు రాష్ట్రాల్లో, రాయల్ ఎన్‌ఫీల్డ్‌ హంటర్ 350 ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.50 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. హైదరాబాద్‌లో, బేస్ మోడల్ రాయల్ ఎన్‌ఫీల్డ్‌ హంటర్ 350 స్టాండర్డ్‌ ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 1.91 లక్షలు. దీనిలో, బండి రిజిస్ట్రేషన్‌, ఇన్సూరెన్స్‌, ఇతర అవసరమైన ఖర్చులు కలిసి ఉంటాయి. విజయవాడలో ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 1.81 లక్షలు. మీరు ఈ బైక్‌ కొనాలనుకుంటే, ఒకేసారి ఇంత డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు, ఫైనాన్స్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు.

విజయవాడలో రాయల్ ఎన్‌ఫీల్డ్‌ హంటర్ 350 బైక్ కొనడానికి మీకు రూ. 1.56 లక్షల వరకు లోన్ లభిస్తుంది. హంటర్ 350 తాళంచెవిని మీ చేతుల్లోకి తీసుకోవడానికి, ముందుగా మీరు రూ. 25,000 డౌన్ పేమెంట్ చెల్లించాలి. బ్యాంక్‌ 9 శాతం వార్షిక వడ్డీ రేటుతో మీకు రూ. 1.56 లక్షల లోన్‌ మంజూరు చేసిందని అనుకుందాం. ఇప్పుడు, మీరు రూ. 25,000 జీతంతో ఈ మోటార్‌ సైకిల్‌ను కొనగలరా, నెలకు EMI ఎంత అవుతుందో చూద్దాం.

4 సంవత్సరాల కోసం ఈ లోన్‌ తీసుకుంటే, 48 నెలల పాటు నెలకు రూ. 4,405 EMI చెల్లించాలి.

3 సంవత్సరాల రుణ కాలపరిమితి ఎంచుకుంటే, 36 నెలల పాటు నెలకు రూ. 5,484 EMI చెల్లించాలి.

2 సంవత్సరాల లోన్‌ టెన్యూర్‌ పెట్టుకుంటే, 24 నెలల పాటు నెలకు రూ. 7,643 EMI చెల్లించాలి.

1 సంవత్సరంలో లోన్‌ క్లియర్‌ చేయాలనుకుంటే, 12 నెలల పాటు నెలకు రూ. 14,121 EMI చెల్లించాలి.

మీ జీతం రూ. 25 వేలు అయితే, అన్ని ఖర్చులు తీసివేసిన తర్వాత మీ దగ్గర కనీసం రూ. 6000 మిగులుతుంటే, 3 సంవత్సరాల రుణ కాల పరిమితితో ఈ బైక్ కొనుగోలును పరిశీలించవచ్చు.

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ హంటర్ మైలేజ్రాయల్ ఎన్‌ఫీల్డ్‌ హంటర్ 350 బైక్‌ 349 cc, సింగిల్-సిలిండర్, 4-స్ట్రోక్ ఇంజిన్‌తో పని చేస్తుంది. ఈ ఇంజిన్ 20.2 bhp పవర్‌ను & 27 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది, బలంగా పరుగు తీస్తుంది. అదే సమయంలో, 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో సున్నితమైన డ్రైవింగ్‌ అనుభవాన్ని ఇస్తుంది. ఈ బండికి 13-లీటర్ ఇంధన ట్యాంక్ ఉంది. కంపెనీ లెక్క ప్రకారం. రాయల్ ఎన్‌ఫీల్డ్‌ హంటర్ 350 బైక్‌ లీటరు పెట్రోల్‌కు 36.2 కి.మీ.ల మైలేజీ ఇస్తుంది.