Hyundai Venue 2025 Features And Launch Date: హ్యుందాయ్ ఇండియా, ఎట్టకేలకు కొత్త తరం హ్యుందాయ్ వెన్యూ లాంచ్ తేదీని వెల్లడించింది. చాలా కాలం పాటు టెస్టింగ్ చేసిన తర్వాత, ఈ పాపులర్‌ SUVని అక్టోబర్ 24, 2025న భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు హ్యుందాయ్‌ కంపెనీ ప్రకటించింది. లాంచ్ తర్వాత.. Maruti Brezza, Tata Nexon, Kia Sonet & Mahindra XUV 3XO వంటి పాపులర్‌ SUVలతో ఈ కారు నేరుగా పోటీ పడుతుంది.

డిజైన్ మార్పులు  ఈసారి, కొత్త హ్యుందాయ్ వెన్యూ లుక్స్‌లో పెద్ద మార్పులు చేసినట్లు తెలుస్తోంది. దీనికి క్వాడ్-LED హెడ్‌ల్యాంప్‌లు & కనెక్టెడ్‌ DRLs ఇచ్చారు, ఇవి ప్రస్తుత Hyundai Creta నుంచి వీటిని తీసుకున్నారు. హెడ్‌ల్యాంప్ కింద L-ఆకారపు LED లైట్లు అందించారు, ఇది ఈ SUV కి ప్రీమియం అపీల్‌ ఇస్తుంది. దీనితో పాటు, కొత్తగా రూపొందించిన 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, మందపాటి వీల్ ఆర్చ్ క్లాడింగ్, ఫ్లాట్ విండో లైన్ & పొడవైన రియర్‌ స్పాయిలర్ వంటి అప్‌డేట్స్‌ కూడా కొత్త హ్యుందాయ్ వెన్యూలో యాడ్‌ చేశారు. ఇవి, ఈ కారు స్ట్రైల్‌ను మునుపటి కంటే స్పోర్టియర్‌గా కనిపించేలా చేస్తాయి.

ఫీచర్లలో పెద్ద అప్‌గ్రెడేషన్‌కొత్త హ్యుందాయ్ వెన్యూలో, ఫీచర్ల పరంగా ఆధునిక మార్పులు చూడవచ్చు. ఇప్పుడు ఈ SUV లెవల్-2 ADAS టెక్నాలజీతో మరింత హైటెక్‌గా వస్తుంది, ఇది డ్రైవింగ్‌ను సురక్షితంగా & తెలివిగా మారుస్తుంది. నాలుగు డిస్క్ బ్రేక్‌లు & ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్‌లు కూడా ఈ కారుకు యాడ్‌ చేశారు, ఇవి బ్రేకింగ్ పనితీరు & పార్కింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తాయి. ఇప్పుడు ఉన్న వెన్యూ SUVలో లెవల్-1 ADAS ఫీచర్లు మాత్రమే ఉన్నాయి, కాబట్టి  పొందుతుంది, కాబట్టి లెవల్-2 ADAS అప్‌డేషన్‌ చాలా కీలకమైనది. అయితే, క్యాబిన్ ఫీచర్ల పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం... హ్యుందాయ్ క్రెటా & అల్కాజార్‌ నుంచి చాలా ప్రీమియం & అధునాతన ఫీచర్లను 2025 క్రెటాలోకి తీసుకున్నారని భావిస్తున్నారు.

మునుపటి ఇంజిన్ ఆప్షన్స్‌కొత్త హ్యుందాయ్ వెన్యూ అనేది ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ కాబట్టి, దీని పవర్‌ట్రెయిన్‌లో ఎటువంటి మార్పులు ఉండవు. మునుపటి లాగే ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ & 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఎంపికలలో లభిస్తుంది. ఈ ఇంజిన్‌లు కస్టమర్‌ అవసరానికి తగినట్లుగా మెరుగైన పనితీరును అందిస్తాయి.

ధరకొత్త హ్యుందాయ్ వెన్యూ ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అయితే, ప్రస్తుతం ఉన్న హ్యుందాయ్ వెన్యూ బేస్‌ వేరియంట్‌ ఎక్స్‌-షోరూమ్‌ ధర (Hyundai Venue ex-showroom price) రూ. 7.94 లక్షలు. ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణలో ఈ వేరియంట్‌ను దాదాపు రూ. 9.58 లక్షల ఆన్‌-రోడ్‌ రేటుకు (Hyundai Venue on-road, Hyderabad Vijayawada) కొనుగోలు చేయవచ్చు.