న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవంతో పాటు పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ పోలీసులు భద్రతను పటిష్టం చేశారు. ఆదివారం నాడు 4000 మందికి పైగా ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు సమావేశం అయ్యారు. ఈ సమావేశం లక్ష్యం ఏంటంటే, లా & ఆర్డర్‌ను (శాంతి భద్రతలను) నిర్వహించడం, ఇండిపెండెన్స్ డే సమయంలో సెక్యూరిటీ గార్డుల పాత్ర చాలా కీలకం. సెక్యూరిటీ గార్డుల ద్వారా ఢిల్లీ నగరంలో భద్రతను బలోపేతం చేయడంతో పాటు ఎక్కడైనా ప్రమాదాలు, అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశం ఉంటే గుర్తించి వారు ప్రాథమికంగా చర్యలు చేపడతారు. ఉన్నతాధికారులకు విషయాన్ని చెప్పి అలర్ట్ చేస్తారు. సెక్యూరిటీ గార్డులకు సంబంధించి ప్రోటోకాల్ మొదలైన వాటి గురించి సమాచారం అందించారు.

సెక్యూరిటీ గార్డుల విధుల సంబంధించి మార్గదర్శకాలు ఇచ్చారు. వారికి టోపీ, రిఫ్లెక్టివ్ జాకెట్, లాఠీ, విజిల్ సహా భద్రతా కిట్‌లను కూడా అందజేశారు. పోలీస్ కమీషనర్ ఎస్‌బికె సింగ్ 2 ప్రధాన కార్యక్రమాలలో గార్డ్స్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. ఢిల్లీ యూనివర్సిటీ నార్త్ క్యాంపస్‌లోని మల్టీపర్పస్ హాల్‌లో దాదాపు 800 మంది సెక్యూరిటీ గార్డులు పాల్గొన్నారు. ఆ తర్వాత సౌత్-ఈస్ట్ జిల్లాలోని లోటస్ టెంపుల్ ఆడిటోరియంలో దాదాపు 300 మంది గార్డులు పాల్గొని భద్రతా చర్యలకు సంబంధించి పోలీస్ కమిషనర్ నుంచి సూచనలు, సలహాలు తీసుకున్నారు.

సెక్యూరిటీ గార్డుల సహకారంతో పటిష్ట భద్రత న్యూస్ ఏజెన్సీ PTI నివేదిక ప్రకారం, కమ్యూనిటీ పోలీసింగ్‌లో సెక్యూరటీ గార్డులు ఒక అనివార్యమైన లింక్ అని.. వారి సహకారంతో లా అండ్ ఆర్డర్ సమస్యలు రాకుండా.. ప్రజల్లో ప్రభావం చూపుతారని పోలీస్ కమీషనర్ అన్నారు. వివిధ జిల్లాల్లో శనివారం జరిగిన సమావేశంలో పాల్గొన్న ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిలో దక్షిణ (305), దక్షిణ-తూర్పు (300), రోహిణి (300), నార్త్ వెస్ట్ (215), వెస్ట్ (230), న్యూ ఢిల్లీ (97), ఔటర్ నార్త్ (383), ఔటర్ (160), ద్వారక (362), నార్త్ ఈస్ట్ (194), సౌత్ వెస్ట్ (180), షాదరా (238), ఈస్ట్ (253), నార్త్ (400), సెంట్రల్ (400) ఉన్నారు.

నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశంఇంటరాక్టివ్ సమావేశాల ద్వారా గార్డులు అవసరమైన చోట మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. తమ చుట్టుపక్కల ప్రాంతాల్లో కఠినంగా తనిఖీలు చేయాలని, నిరంతరం నిఘా ఉంచాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. నగరంలోని వారసత్వ వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వస్తువులు, బ్యాగులు కనిపిస్తే వెంటనే తనిఖీలు చేయాలని పోలీస్ కమిషన్ గార్డులకు సూచించారు. ముఖ్యంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సమయంలో ప్రజలు గుంపులు గుంపులుగా లేకుండా చూసుకోవాలని, ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు.