Rohingya In Andamans:


అండమాన్‌లో చిక్కుకుని..


కనీసం 100 మంది రోహింగ్యాలు అండమాన్ దీవుల్లో చిక్కుకున్నారు. వీరిలో 16-20 మంది దాహంతో అల్లాడిపోయి మృతి చెందారని తెలుస్తోంది. ఆకలికి తట్టుకోలేక ఇలా నేల రాలిపోతున్నారని రోహింగ్యా యాక్టివిస్ట్ గ్రూప్‌లు వెల్లడించాయి. ఏటా ఇలా వందలాది మంది రోహింగ్యాలు పడవల సాయంతో వేరే దేశాలకు వలస వెళ్తుంటారు. మయన్మార్, బంగ్లాదేశ్‌లో దారుణమైన జీవితాలకు దూరంగా గడపాలనుకున్న వాళ్లంతా ఇలా ప్రాణాలకు తెగించి మరీ దేశం దాటుతారు. వీరిలో ఎక్కువ మంది మలేషియాకు తరలిపోతారు. ఈ క్రమంలోనే ప్రాణాలూ కోల్పోతారు. ఇండియన్ నేవీ ఈ పడవను గుర్తించింది. అయితే...ఆ పడవ ఎక్కడి నుంచి వచ్చిందన్నది పూర్తి వివరాలు తెలియరాలేదని నేవీ వెల్లడించింది. "కనీసం 20 మంది చనిపోయి ఉంటారు. కొంత మంది ఆకలితో, మరి కొందరు దప్పికతో ప్రాణాలు కోల్పోయారు. కొందరు తప్పించుకోవాలనే తొందరలో నీళ్లలోకి దూకి ఉంటారు. ఇది చాలా దారుణం" అని అధికారులు అన్నారు. ఇలా రెండు వారాల పాటు నీళ్లలో కొట్టుకుపోయి..ఎక్కడో తేలతారని చెప్పారు. "ఇండియన్ వెసెల్స్‌ ఆ పడవ దగ్గరికెళ్లి పూర్తి వివరాలు సేకరించే పనిలో ఉంది. అప్‌డేట్స్‌ ఏంటో తరవాతే తెలుస్తాయి" అని వెల్లడించారు. "వీలైనంత త్వరగా ఇండియన్ నేవీ వాళ్లను రక్షిస్తుందని ఆశిస్తున్నాం. ఓ పాడైపోయిన పడవను పట్టుకుని నీళ్లలో రెండు వారాలుగా ప్రయాణం చేసి వచ్చారు. వీళ్లకెక్కడా నీళ్లు, ఆహారం దొరకలేదు. కనీసం 16 మంది చనిపోయి ఉంటారు" అని రోహింగ్యా వర్కింగ్ గ్రూప్ తెలిపింది. శ్రీలంకలోనూ ఇలాంటి పడవే ఒకటి కనిపించగా...వందలాది మంది రోహింగ్యాలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది ప్రభుత్వం. 2018లో 7 లక్షల 30 వేల మంది రోహింగ్యా ముస్లింలు బంగ్లాదేశ్‌కు వలస వెళ్లారు. మయన్మార్‌లో సైనిక పాలన అరాచకాలు తట్టుకోలే ఇలా పొరుగు దేశానికి వలస వెళ్తున్నారు. 


కేంద్రమంత్రి ప్రకటన..


ఈ ఏడాది ఆగస్టులో దిల్లీలోని బక్కర్‌వల ప్రాంతంలో రోహింగ్యాల కోసం ప్రత్యేకంగా అపార్ట్‌మెంట్‌లు కడతామని, వారికి రక్షణ కూడా కల్పిస్తామని కేంద్రమంత్రి హర్‌దీప్ సింగ్ పురి ప్రకటించిన కాసేపటికే...కేంద్రం ఈ ప్రకటనను ఖండించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ..
ఇలాంటి నిర్ణయమేమీ తీసుకోలేదని స్పష్టం చేసింది. "అక్రమంగా దేశంలోకి వచ్చిన వాళ్లను డిటెన్షన్ సెంటర్స్‌లోనే ఉంచుతాం. వారు మన దేశం వదిలి వెళ్లేంత వరకూ ఆ కేంద్రాల్లోనే ఉంటారు" అని వెల్లడించింది. అంతే కాదు. ప్రస్తుతం బక్కర్‌వల ప్రాంతంలో ఉన్న శరణార్థుల్ని 
వేరే ప్రాంతానికి తరలించాలని దిల్లీ ప్రభుత్వానికి సూచించింది. ప్రస్తుతం వాళ్లు ఉంటున్న ప్రాంతాన్ని డిటెన్షన్ సెంటర్‌గా ప్రకటించకూడదని తేల్చి చెప్పింది. టెంట్‌లలో నివసిస్తున్న 1100 మంది రోహింగ్యా శరణార్థులను అపార్ట్‌మెంట్లలోకి తరలిస్తామని, వారికి రౌండ్ ది క్లాక్ భద్రత 
కూడా కల్పిస్తామని హర్‌దీప్ సింగ్ పురి ట్వీట్ చేశారు. కానీ హోం మంత్రిత్వ శాఖ ప్రకటన ఇందుకు భిన్నంగా ఉండటం ఆశ్చర్యం కలిగించింది. 


Also Read: Afghan Women Banned: మహిళలకు యూనివర్సిటీల్లో నో ఎంట్రీ, విద్యార్థుల కలల్ని చిదిమేస్తున్న తాలిబన్లు