One year old bites cobra in Bihar: కోబ్రా కనిపిస్తే కొట్టి  చంపుతాం. స్నేక్ క్యాచర్లు అయితే తోక పట్టుకుని సంచిలో వేసుకునిపోతారు.  వాళ్లు అయినా చాలా జాగ్ర్తతగా ఉండాల్సిందే.  ఎందుకంటే ఆ పాము చాలా విషపూరితం. అయితే బీహార్ లో ఏడాది వయసున్న బాలుడు.. కోబ్రాను కొరికి చంపేశాడు. కానీ ఆ బాలుడికి ఏం కాలేదు.    బీహార్‌లోని వెస్ట్ చంపారన్ జిల్లాలోని బెట్టియా సమీపంలో ఈ అసాధారణ  ఘటన జరిగింది. ఈ సంఘటనలో ఒక ఏడాది వయస్సు గల బాలుడు గోవింద కుమార్, ఒక కోబ్రా ను కొరికి చంపేశాడు. ఈ ఘటన బీహార్‌లోని వెస్ట్ చంపారన్ జిల్లాలోని మజౌలియా బ్లాక్‌లో ఉన్న మొహచ్చి బంకట్వా గ్రామంలో జరిగింది.

గోవింద కుమార్, సునీల్ సాహ్ కుమారుడు, ఒక ఏడాది వయస్సు గల బాలుడు  ఇంటి సమీపంలో ఆడుకుంటున్నప్పుడు. ఆ సమయంలో ఒక రెండు అడుగుల పొడవైన కోబ్రా పాము అతని దగ్గరకు వచ్చింది. బాలుడు దాన్ని బొమ్మగా భావించి తీసుకున్నాడు.  పాము అతని చేతుల చుట్టూ చుట్టుకున్నప్పుడు బాలుడు  భయపడకుండా దాన్ని కొరికేశాడు.  అతని అమ్మమ్మ  గమనించి పరుగున వచ్చింది. పాము బతికి ఉందేమో అని తప్పించేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే ఆ పాము చనిపోయినట్లుగా గుర్తించారు. 

పామును  కొరికిన  బాలుడు వెంటనే స్పృహ కోల్పోయాడు. అతని కుటుంబం అతన్ని సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)కి తీసుకెళ్లింది, అక్కడ నుండి అతన్ని బెట్టియాలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ (GMCH)కి రిఫర్ చేశారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.  బాలుడి శరీరంలో విషం   లక్షణాలు కనిపించలేదని వైద్యులు చెబుతున్నారు. 

సాధారణంగా పాము కాటు వల్ల విషం రక్తంలోకి చేరి నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఇది తీవ్రమైన సమస్యలకు లేదా మరణానికి దారితీస్తుంది. అయితే బాలుడి విషయంలో జరిగిది వేరు. అతను పాముని కొరికాడు. అంటే విషం అతని జీర్ణ వ్యవస్థ ద్వారా చేరింది. మానవ జీర్ణ వ్యవస్థ కొన్ని సందర్భాల్లో విషాన్ని విచ్ఛిన్నం చేసి హాని జరగకుడా చూస్తుందని వైద్యులు విశఅలేషిస్తున్నారు.  ఒకవేళ  బాలుడి ఆహార నాళంలో పుండ్లు లేదా అంతర్గత రక్తస్రావం ఉంటే  ప్రాణం నిలిచేది కాదన్నారు.  

ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది.  కొందరు దీనిని పురాణ కథలో లార్డ్ కృష్ణుడు కాళియా నాగాన్ని ఓడించిన కథతో పోల్చి చెబుతున్నారు.